Home /News /sports /

JUST CHECK THIS EXCLUSIVE VIDEO FOR TEAM INDIA DRESSING ROOM CELEBRATIONS AFTER LORDS TEST VICTORY JNK

Watch Video: లార్డ్స్‌లో మనోళ్ల సెలెబ్రేషన్ మామూలుగా లేదుగా.. డ్రెస్సింగ్ రూమ్‌లో తగ్గేదేల్యా.. అంటూ ఎంజాయ్

టీమ్ ఇండియా సంబరాలు మామూలుగా లేవుగా.. (PC: BCCI)

టీమ్ ఇండియా సంబరాలు మామూలుగా లేవుగా.. (PC: BCCI)

లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ అనంతరం భారత జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంబరాలతో మునిగిపోయింది. జట్టు విజయంపై కోహ్లీ, పుజార, సిరాజ్ స్పందించారు. వారి సంతోషం వారి మాటల్లోనే విందాం..

    లార్డ్స్ మైదానంలో చారిత్రాత్మక విజయం సాధించిన టీమ్ ఇండియాపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. ఓడిపోతాము అనుకున్న మ్యాచ్‌ను ఒకే రోజులో మలుపు తిప్పేసి ఆతిథ్య ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించారు. మహ్మద్ సిరాజ్ చివరిగా అండర్సన్ వికెట్ తీయగానే మైదానంలోనే సంబరాలు మొదలయ్యాయి. ఒకరినొకరు హగ్ చేసుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ గెలుపు సంబరాలు జరుపుకున్నారు. ఇక జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన తర్వాత సంబరాలు అంబరాన్నంటాయి. ఈ విజయంపై ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

    విరాట్ కోహ్లీ : ఇది టీమ్ అందరి విజయం. నిజంగా ఈ మ్యాచ్‌లో మేం చూపించిన పట్టుదల, పోరాటం అసమాన్యమైనవి. చాలా ఏళ్ల వరకు ఈ విజయం గుర్తుండి పోతుంది. అందుకే డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రతీ ఒక్కరు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

    అజింక్య రహానే : మేం ఆడిన తీరు మాకు ఎంతో తృప్తిని ఇచ్చింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో గొప్ప పోరాటం చేసి తిరిగి మ్యాచ్‌లోకి మేం వచ్చాము. ఇది నిజంగా మాకు చాలా గర్వకారనం

    రోహిత్ శర్మ: ఒకరు ఇద్దరని కాదు. జట్టులోని 11 మంది కూడా కలసి తమ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చారు. మ్యాచ్‌లోని ఐదు రోజుల్లో ఒక్కో దశలో ఒక్కోక్కరు తమ బాధ్యతను నెరవేర్చడంతోనే ఈ రోజు మ్యాచ్ గెలవగలిగాము.

    కేఎల్ రాహుల్: ఇంగ్లాండ్‌కు వచ్చి టెస్టు మ్యాచ్ గెలవడం నిజంగా చాలా చాలా ప్రత్యేకమైనది. ఈ క్రెడిట్ అందరికీ దక్కుతుంది. గత రెండున్నర నెలలుగా అందరూ ఎదురు చూస్తున్న విజయం ఇది.

    చతేశ్వర్ పుజార: టెస్ట్ సిరీస్‌కు ఇదొక గొప్ప ఆరంభం. మేం ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. కానీ తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన తీరు మాకు నిజంగా గర్వంగా అనిపిస్తున్నది. ఇదే విజయపరంపరను కొనసాగించాలని అనుకుంటున్నాము.





    మహ్మద్ షమి: ఐదు టెస్టుల సిరీస్‌ను మేం 1-0తో ఆధిక్యంలో నిలిచాము. ఈ విషయం మాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నది. రాబోయే రోజుల్లో ఇంకా మూడు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల ద్వారా మేం సంపాదించిన ఆత్మవిశ్వాసాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము. అది జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది.

    మహ్మద్ సిరాజ్: నేను దేశం కోసం ఆడి మంచి ప్రదర్శన చేసి మ్యాచ్‌ గెలుపులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉన్నది. ఇది నాకు చాలా పెద్ద గెలుపు అని నేను అనుకుంటున్నాను.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: India vs england, Team india, Test Cricket, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు