బట్లర్ బ్యాటుపై బూతు మాట!

బట్లర్ బ్యాట్‌పై రాసి బూతు రాతలు ఇప్పుడు క్రికెట్ అభిమానులు, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Chinthakindhi.Ramu | news18
Updated: June 6, 2019, 2:22 PM IST
బట్లర్ బ్యాటుపై బూతు మాట!
josbuttler
  • News18
  • Last Updated: June 6, 2019, 2:22 PM IST
  • Share this:
ఐపీఎల్ 11వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు జట్టులోకి వచ్చాడు జాస్ బట్లర్. వరుసగా ఐదు అర్థ శతకాలు సాధించి, రాయల్స్ జట్టును ప్లే ఆఫ్ రేసులో నిలిపాడు. తర్వాత పాకిస్తాన్ తో సిరీస్ కోసం తమ దేశం వెళ్లిపోయినా రాయల్స్ జట్టు ప్లే ఆఫ్ చేరుకుని మంచి ఆటే కనబరిచింది. ఐపీఎల్ ఇచ్చిన నమ్మకంతో పాకిస్థాన్ తో జరుగుతున్న సిరీస్ లోనూ చెలరేగిపోతున్నాడు ఈ ఇంగ్లండ్ క్రికెటర్. అయితే బట్లర్ బ్యాటుపై కనిపించిన ఓ బూతు మాట ఇప్పుడు అతన్ని వివాదాల్లోకి నెట్టేసింది.

పాకిస్థాన్ తో జరిగిన టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చాడు జోస్ బట్లర్. ఇన్నింగ్స్ చక్కబెడుతూ 101 బంతులు ఎదుర్కొని 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ ఇంగ్లీషు జట్టు భారీ స్కోరు చేయడానికి కారణమైంది. ఫలితంగా పాక్ పై ఇన్నింగ్స్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇంగ్లండ్ జట్టు. గత సెప్టెంబర్ నుంచి విజయం దక్కించుకోని ఇంగ్లండ్ జట్టుకి ఈ సీజన్లో ఇది తొలి విజయం. మొదటి టెస్టులో పాకిస్థాన్ చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది ఇంగ్లీష్ జట్టు. అయితే జట్టుకి విజయాన్ని అందించిన బట్లర్ ఆట కంటే ఇప్పుడు అతని బ్యాటుపై కనిపించిన బూతు పదమే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్రీజులో పెట్టిన బట్లర్ బ్యాటు హ్యాండిల్ వెనక ఓ బూతు పదం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. దాంతో బట్లర్ భాయ్... ఏందింది? నీకిది తగునా! అంటూ సోషల్ మీడియాలో జోస్ బట్లర్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. నిజానికి అదేమంత పెద్ద బూతు కాదు. చాలా సినిమాల్లో వినిపించే పదమే. అయితే జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో బ్యాటు, బంతి, వికెట్లను కూడా పవిత్రంగా చూసుకోవాలి. అలా గౌరవంగా చూసుకోవాల్సిన బ్యాట్, బాల్ తదితర వాటిపై కోపాన్ని ప్రదర్శిస్తే సదరు ఆటగాళ్లపై క్రమశిక్షణా ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటారు. మరి అలాంటి బ్యాటుపై ఇలాంటి బూతు పదాలు తగునా? అనేది క్రికెట్ అభిమానుల ప్రశ్న.
First published: June 5, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు