వేలంలో జాక్‌పాట్..సింధుని కలిసిన ఆనందంలో ఉనద్కత్ స్పెషల్ ట్వీట్

ఐపీఎల్‌ 2019 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన ఉనద్కత్...బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్ నెగ్గి చరిత్ర సృష్టించిన పీవి సింధుతో కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: December 19, 2018, 6:44 PM IST
వేలంలో జాక్‌పాట్..సింధుని కలిసిన ఆనందంలో ఉనద్కత్ స్పెషల్ ట్వీట్
పీవి సింధు, జయదేవ్ ఉనద్కత్ ( Jaydev Unadkat / twitter )
  • Share this:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన జయదేవ్ ఉనద్కత్ పేరు ప్రస్తుతం మార్మోగిపోతోంది. ఐపీఎల్‌ 2019 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన ఉనద్కత్ క్రికెట్ వరల్డ్‌లో మాత్రమే కాదు...సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో హాట్ టాపిక్‌గా మారాడు. 12వ సీజన్ కోసం జరిగిన వేలంలో రూ.8.4 కోట్ల భారీ మొత్తంతో రాజ‌స్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఉనద్కత్‌ను దక్కించుకుంది. వేలంలో కాస్ట్లీ ప్లేయర్‌గా నిలిచినా సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ చేయని జయదేవ్ ఉనద్కత్...భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవి సింధుని కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

"వరల్డ్ టూర్ ఫైనల్స్‌ టైటిల్ నెగ్గిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన పీవి సింధును కలిసే గౌరవం దక్కింనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది..నేను సింధుకు పెద్ద అభిమాని"..అని సింధుతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు.




జయదేవ్ ఉనద్కత్ పోస్ట్‌కు స్పందిస్తూ...నిన్ను కలుసుకున్నందుకు నాకు కూడా ఆనందంగానే ఉంది" అని రిప్లై ఇచ్చింది. రీసెంట్‌గా బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్ నెగ్గిన సింధు‌పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. 12వ సీజన్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన ఉనద్కత్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఈ ఇద్దరూ ట్రెండింగ్ స్టార్స్ కలిసి దిగిన ఫోటో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది.


ఐపీఎల్ 2019 సీజన్ వేలంలో ఉనద్కత్ కోసం ఐదు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. చివరకు రూ 8.4 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఉనద్కత్‌ను తిరిగి సొంతం చేసుకుంది. ఈ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్‌లోనూ రాజస్థాన్ రాయల్స్ జట్టుకే ప్రాతినిధ్యం వహించడం విశేషం. 2018 సీజన్ వేలంలో రాజస్థాన్ ఫ్రాంచైజీ 11.5 కోట్లతో ఉనద్కత్‌ను దక్కించుకుంది.

భారత్ తరఫున ఇప్పటికే టెస్ట్, వన్డే, ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున 10 ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు, 7 వన్డే మ్యాచ్‌లు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడాడు.





Published by: Prasanth P
First published: December 19, 2018, 6:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading