HOME »NEWS »SPORTS »javed miandad controversy against india brandishing a sword brandishing a sword mk

బాంబులతో వచ్చినా సరే...భారత్‌తో కత్తి యుద్ధానికి సిద్ధం అంటున్న పాకిస్థాన్ క్రికెటర్...

బాంబులతో వచ్చినా సరే...భారత్‌తో కత్తి యుద్ధానికి సిద్ధం అంటున్న పాకిస్థాన్ క్రికెటర్...
కత్తి దూస్తున్న జావేద్ మియాందాద్(Twitter)

ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాకిస్థాన్‌లో కాశ్మీర్ విషయమై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడి నేతలు కాశ్మీర్ ను ఉద్దేశించి అడ్డగోలు ప్రకటనలు చేస్తే ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జావేద్ మియాందాద్ తల్వార్ తో యుద్ధానికి సిద్ధం అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

  • Share this:
    పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కాశ్మీర్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన కత్తి పట్టుకొని, తనకు బ్యాటుతో సిక్సర్లు బాదడం వచ్చని...వీలైతే తల్వార్‌‌తో మనుషులను చంపడం కూడా వచ్చు అంటూ అక్కడి పబ్లిక్‌ను ఉద్దేశించి అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాకిస్థాన్‌లో కాశ్మీర్ విషయమై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడి నేతలు కాశ్మీర్ ను ఉద్దేశించి అడ్డగోలు ప్రకటనలు చేస్తే ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జావేద్ మియాందాద్ తల్వార్ తో యుద్ధానికి సిద్ధం అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ తరపున క్రికెట్ ఆడిన జావెద్ మియాందాద్ మొత్తం 5 ప్రపంచ కప్‌లు ఆడిన అనుభవం ఉంది. అయితే క్రికెట్ అనంతరం ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అడపాదడపా మీడియాకు ఎక్కడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా భారత్ పై విషం చిమ్మడంలో మియాందాద్ ఎప్పుడు ముందువరుసలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

    ఇదిలా ఉంటే భారత్ నుంచి పరారై విదేశాల్లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుమార్తెను ఆయన ఇంటికి కోడలుగా తెచ్చుకోవడం కొసమెరుపు.





    Published by:Krishna Adithya
    First published:September 02, 2019, 16:22 IST