ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు జస్‌ప్రీత్ బుమ్రా పెను సవాలే : సచిన్ టెండుల్కర్

Jasprit Bumrah : యార్కర్లతో విరుచుకుపడే జస్‌ప్రీత్ బుమ్రాను చూసి... ప్రత్యర్థి జట్లన్నీ భయపడుతున్నాయి. క్రికెట్ దిగ్గజాలంతా... అతని ఫాస్ట్ బౌలింగ్‌కి ఫిదా అవుతున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సైతే... యంగ్ ట్విస్టర్‌పై అంచనాలు పెంచేస్తున్నాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: February 5, 2019, 1:37 PM IST
ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు జస్‌ప్రీత్ బుమ్రా పెను సవాలే : సచిన్ టెండుల్కర్
జస్‌ప్రీత్ బుమ్రా, సచిన్ టెండుల్కర్ (Image : Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: February 5, 2019, 1:37 PM IST
ఆస్ట్రేలియాతో చరిత్రాత్మక 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ని టీంఇండియా గెలవడంలో పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రా కీలకంగా వ్యవహరించాడు. ఈ ఫాస్ట్ బౌలర్... 21 వికెట్లు తీసి... ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఓ టెస్టు సిరిస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల జాబితాలో బుమ్రా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతని ఆట తీరును చూసి... ఆశ్చర్యపోయిన పాకిస్థాన్ పేస్ బౌలర్ వసీం అక్రం... ప్రపంచ క్రికెట్లో అత్యంత అద్భుతమైన యార్కర్లు వేసే నైపుణ్యం బుమ్రాకు మాత్రమే ఉందని మెచ్చుకున్నాడు.

jasprit bumrah, sachin tendulkar, jasprit bumrah bowling, jasprit bumrah yorkers, jasprit bumrah reminded sachin tendulkar, jasprit bumrah last over, sachin tendulkar vs jasprit bumrah, jasprit bumrah speech in hindi, sachin tendulkar about bumrah, సచిన్ టెండుల్కర్, జస్ ప్రీత్ బుమ్రా, బుమ్రా బౌలింగ్
జస్‌ప్రీత్ బుమ్రా (Image : Twitter)


తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూడా... బుమ్రాను ప్రశంసలతో ముంచెత్తాడు. పేస్‌ బౌలింగ్‌తో బ్యాట్స్‌మన్లను తిప్పలు పెడుతున్న బుమ్రాయే... ఈ ఏడాది జరిగే క్రికెట్ ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్లకు అతిపెద్ద సవాల్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
ఐసీసీ వరల్డ్ ర్యాంకుల్లో టెస్టులు, వన్డేల్లో అత్యుత్తమ బౌలర్ల లిస్టులో బుమ్రా నెంబర్ వన్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లపై అతను దుమ్ము రేపుతుండటమే ఇందుకు కారణం. ప్రపంచకప్ జరగడానికి ఇంకెన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు లేవు. ఈలోగా టీంఇండియా అన్నింటికీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. మిడిల్ ఆర్డర్ విషయంలో ఇప్పటికీ కొంత ఆందోళన ఉందన్న సచిన్... బౌలింగ్ విభాగం చక్కగా రాణిస్తోందని మెచ్చుకున్నాడు. ఇంగ్లండ్, వేల్స్ రెండు చోట్లా బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించిన బుమ్రా... కొన్ని నెలలుగా తిరుగులేని ఫామ్ చూపిస్తున్నాడని క్రికెట్ లెజెండ్ అభిప్రాయపడ్డాడు.


ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఎంట్రీ ఇచ్చి... సత్తా చాటిన బుమ్రా... బౌలింగ్ ఎటాక్ చెయ్యడంలో ఆరితేరిపోయాడని సచిన్ మెచ్చుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న అతను... ప్రపంచకప్‌లో భారత జట్టుకు పెద్ద అసెట్ అవుతాడనటంలో ఆశ్చర్యం అక్కర్లేదన్నాడు.

jasprit bumrah, sachin tendulkar, jasprit bumrah bowling, jasprit bumrah yorkers, jasprit bumrah reminded sachin tendulkar, jasprit bumrah last over, sachin tendulkar vs jasprit bumrah, jasprit bumrah speech in hindi, sachin tendulkar about bumrah, సచిన్ టెండుల్కర్, జస్ ప్రీత్ బుమ్రా, బుమ్రా బౌలింగ్
విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా (Image : Twitter)


గతేడాది జనవరిలో సౌతాఫ్రికాతో తొలిసారి టెస్టు ఆడిన బుమ్రా రెడ్ బాల్‌తో యార్కర్లు సంధిస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లోనూ తన మార్క్ చూపించాడు. తాజాగా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో బుమ్రా దాటికి ఎదురే లేకుండా పోయింది. 2018లో 10 టెస్టులు ఆడి... 49 వికెట్లు తీసిన అతడు... ప్రీమియర్ టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్ పర్యటనకు సైతం పేసర్ బుమ్రాకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేశారు.

ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో యార్కర్లు సంధించడంలో జస్‌ప్రీత్‌ బుమ్రాను మించిన వారు లేరు. ఫాస్ట్‌బౌలరైన బుమ్రా అత్యంత ప్రభావవంతంగా యార్కర్లు సంధించగలడు. అతడి బౌలింగ్‌ శైలి ఇతరులకన్నా విభిన్నంగా ఉండడమే దీనికి కారణం. వన్డేల్లోనే కాకుండా టెస్టుల్లో కూడా నిరంతరం యార్కర్లు వేయగలడు. అప్పట్లో నేను, వకార్‌ యూనిస్‌ ఇలా వేశాం. పాక్‌ నుంచి నేను, భారత్‌ నుంచి బుమ్రా టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ నుంచి వచ్చినవాళ్లమే
- పాక్ పేస్‌ దిగ్గజం వసీం ఆక్రం


 

Video: దోపిడీకి వచ్చిన కుర్రాళ్లు ఏం చేశారో చూడండి
First published: February 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...