హోమ్ /వార్తలు /క్రీడలు /

Jasprit Bumrah : సంగీత్ కార్యక్రమంలో ప్రేయసి సంజనాతో ఆడి పాడిన బుమ్రా..వైరల్ వీడియో..

Jasprit Bumrah : సంగీత్ కార్యక్రమంలో ప్రేయసి సంజనాతో ఆడి పాడిన బుమ్రా..వైరల్ వీడియో..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Jasprit Bumrah : టీమిండియా స్పీడ్ స్టార్ బుమ్రా నిన్న ఓ ఇంటివాడైన సంగతి తెలిసింది. ప్రేయసి, స్పోర్ట్స్ ప్రెజంటర్ సంజనా గణేషన్‌ను బుమ్రా సోమవారం వివాహం చేసుకున్నాడు టీమిండియా పేస్ గుర్రం. ప్రస్తుతం బుమ్రా డ్యాన్స్ వీడియో ఒకటి వైరల్ గా మారింది.

ఇంకా చదవండి ...

టీమిండియా స్పీడ్ స్టార్ బుమ్రా నిన్న ఓ ఇంటివాడైన సంగతి తెలిసింది. ప్రేయసి, స్పోర్ట్స్ ప్రెజంటర్ సంజనా గణేషన్‌ను బుమ్రా సోమవారం వివాహం చేసుకున్నాడు టీమిండియా పేస్ గుర్రం. ప్రస్తుతం బుమ్రా డ్యాన్స్ వీడియో ఒకటి వైరల్ గా మారింది.

మైదానంలో నిప్పులు చెరిగే బంతులేయడం, పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌ పంపడం మనం ఇన్నాళ్లూ చూశాం. కానీ, అతడికి డ్యాన్స్ చేయడం, పాటకు తగ్గట్లు స్టెప్పులేయడం కూడా వచ్చనే విషయం ఈ వీడియో ద్వారా తెలిసింది. పెళ్లికి ముందు నిర్వహించిన సంగీత్‌ కార్యక్రమంలో తన ప్రియసఖితో కలిసి ఆడిపాడాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు బుమ్రా వ్యక్తిగత కారణాలతో టీమ్‌ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. ఈ విషయంపై ఎన్ని వార్తలొచ్చినా టీమిండియా పేసర్‌ మౌనంగానే ఉన్నాడు. తన పనుల్లో తాను నిమగ్నమయ్యాడు. చివరికి సోమవారం సంజనతో ఒక్కటైన ఫొటోలను స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

మరోవైపు పెళ్లికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సైతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. వివాహం తర్వాత 27 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా.. భారత క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకి విందు ఇవ్వనున్నట్లు సమాచారం తెలుస్తోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌లోనూ బుమ్రా ఆడటంపై సందేహాలు ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరగనున్న విషయం తెలిసిందే. గత ఏడాది ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.


మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్​. తర్వాత జర్నలిస్ట్​గా మారి ఎంటీవీ స్ప్లిట్స్​ విల్లా సీజన్​7తో తన కెరీర్​ ప్రారంభించారు. సంజన ప్రస్తుతం ఐపీఎల్​ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్​గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌కి కూడా స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా సంజనా పనిచేశారు.

First published:

Tags: Jasprit Bumrah, Sanjana Ganesan, Viral Video

ఉత్తమ కథలు