హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA : గాయంతో బుమ్రా అవుట్.. సిరాజ్ ఇన్.. సఫారీతో మిగిలిన రెండు టి20లకు భారత జట్టు ఇదే

IND vs SA : గాయంతో బుమ్రా అవుట్.. సిరాజ్ ఇన్.. సఫారీతో మిగిలిన రెండు టి20లకు భారత జట్టు ఇదే

PC : TWITTER

PC : TWITTER

IND vs SA : వెన్ను గాయంతో దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగే మిగిలిన రెండు టి20ల నుంచి భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తప్పుకున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA : వెన్ను గాయంతో దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగే మిగిలిన రెండు టి20ల నుంచి భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తప్పుకున్నాడు. దాంతో మిగిలిన రెండు మ్యాచ్ ల కోసం అతడి స్థానంలో హైదరాబాద్ స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj)ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీ (BCCI) అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. మిగిలిన రెండు మ్యాచ్ ల కోసం అతడు జట్టుతో కలుస్తాడని కూడా బీసీసీఐ తెలిపింది. వెన్ను గాయంతో బుమ్రా 4 నుంచి 6 నెలల పాటు క్రికెట్ కు దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు గురువారం వార్తలు వచ్చాయి. స్ట్రెస్ ఫ్రాక్చర్ తో ఇబ్బంది పడుతున్నట్లు.. గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

గాయం కారణంగా బుమ్రా ఆసియా కప్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గాయం నుంచి కోలుకున్న అతడు ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ కు ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ కు దూరంగా ఉన్నా.. మిగిలిన రెండు టి20ల్లో ఆడాడు. అయితే సౌతాఫ్రికాతో జరిగే తొలి టి20కి గాయంతో దూరమయ్యాడు. అనంతరం అతడిని పరీక్షించిన వైద్యులు గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. దాంతో అతడు సౌతాఫ్రికాతో సిరీస్ తో పాటు టి20 ప్రపంచకప్ కు కూడా దూరంగా  ఉండనున్నాడు.

రెండంటే రెండే మ్యాచ్ లు

ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత బుమ్రా పెద్దగా సిరీస్ లు ఆడింది కూడా లేదు. కేవలం ఇంగ్లండ్ పర్యటనలో మాత్రమే పాల్గొన్నాడు. అనంతరం విశ్రాంతిలో ఉన్నాడు. అయితే ఆసియా కప్ కు ముందు బుమ్రా గాయంతో ఉన్నట్లు తేలింది. దాంతో అతడు ఆ టోర్నీకి దూరంగా ఉన్నాడు. అనంతరం కోలుకుని పునరాగమనం చేశాడు. రెండు మ్యాచ్ లు ఆడాడో లేదో.. మళ్లీ గాయం బారిన పడ్డాడు. బుమ్రా గాయంతో దాదాపుగా టి20 ప్రపంచకప్ నుంచి కూడా తప్పుకున్నట్లే. అదే జరిగితే టి20 ప్రపంచకప్ లో భారత్ బలహీనమైన బౌలింగ్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా లాంటి పిచ్ లపై ఇది భారత్ కు మింగుడు పడని వార్తే.

టీమిండియా జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అశ్విన్, చహల్, దీపక్ చహర్, అర్ష్ దీప్ సింగ్, సిరాజ్, ఉమేశ్ యాదవ్, షాబాజ్ అహ్మద్, శ్రేయస్ అయ్యర్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, India vs South Africa, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj

ఉత్తమ కథలు