హోమ్ /వార్తలు /క్రీడలు /

Jasprit Bumrah : పెళ్లైంది..నీలో మ్యాటర్ తగ్గింది..ఫోటోలు కాదు ముందు వికెట్లు తీయ్‌..బుమ్రాపై ట్రోల్స్..

Jasprit Bumrah : పెళ్లైంది..నీలో మ్యాటర్ తగ్గింది..ఫోటోలు కాదు ముందు వికెట్లు తీయ్‌..బుమ్రాపై ట్రోల్స్..

జస్ప్రీత్ బుమ్రా - సంజనా గణేశన్

జస్ప్రీత్ బుమ్రా - సంజనా గణేశన్

Jasprit Bumrah : WTC ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా దారుణ ప్రదర్శనపై విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పెద్దగా రాణించింది కూడా లేదు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి చెరో ఏడు వికెట్లు తీయగా.. బుమ్రా మాత్రం ఎలాంటి వికెట్ తీయలేదు.

ఇంకా చదవండి ...

WTC ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా దారుణ ప్రదర్శనపై విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పెద్దగా రాణించింది కూడా లేదు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి చెరో ఏడు వికెట్లు తీయగా.. బుమ్రా మాత్రం ఎలాంటి వికెట్ తీయలేదు. పేస్ బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై బుమ్రా వైఫల్యం కోహ్లీసేన కొంప ముంచింది. దీంతో టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రాపై ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు బుమ్రా. సతీమణి సంజనా గణేశన్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న బుమ్రాపై అభిమానులు మండిపడ్డారు. అసలే కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోరంగా విఫలమయ్యాడని కోపంతో ఉన్న అభిమానులకు తాజా ఫోటో బుమ్రాపై మరింత కోపం వచ్చేలా చేసింది. దీంతో అభిమానులు ట్రోల్స్‌, మీమ్స్‌తో రెచ్చిపోయారు.

'' పెళ్లైన నాటి నుంచి ఫోటోల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నావు.. నీలో మునపటి జోష్‌ లేదు.. బుమ్రా ఫోటోలు కాదు ముందు వికెట్లు తీయ్‌.. బుమ్రా భయ్యా వికెట్‌ ఎప్పుడు తీస్తావు.. ముంబై ఇండియన్స్‌ తరపున రెచ్చిపోయి బౌలింగ్‌ చేస్తావు.. మరి టీమిండియాకు వచ్చేసరికి ఎందుకిలా చేస్తున్నావు.'' అంటూ కామెంట్లు చేశారు. కొన్ని రోజులు ఫోటోలు షేర్ చేయకుండా గదిలో పండుకోమని ఒకరంటే.. పెళ్లాంతో ఫొటోలు షేర్ చేసేందుకు సిగ్గుండాలి బుమ్రా? అని మరొకరు ఘాటుగా కామెంట్ చేశారు. అంతేకాకుండా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా బుమ్రా కారణంగానే భారత్ ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. అతన్ని అనవసరంగా ఆడించారని, బుమ్రా పనైపోయిందని మండిపడుతున్నారు.









View this post on Instagram






A post shared by jasprit bumrah (@jaspritb1)



ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగియడంతో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవుతుంది. ఆగస్టు 4 నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. మరి ఈ టెస్టు సిరీస్‌తోనైనా టీమిండియా ఫామ్‌లోకి వస్తుందేమో చూడాలి. ఆ టెస్ట్ సిరీస్‌కు ఇంకా ఆరు వారాల సమయం ఉంది. అన్ని రోజుల పాటు బయో బుడగలో ఉండటం కష్టం. అంతేకాకుండా ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో వారిని ఉల్లాసంగా ఉంచేందుకు మూడు వారాల పాటు టీమిండియా క్రికెటర్లకు విరామం ఇచ్చారు. బుడగ నుంచి బయటకు వెళ్లి గడిపేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఆటగాళ్లంతా ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు టీమిండియా క్రికెటర్లు. ఈ నేపథ్యంలోనే బుమ్రా తన భార్య సంజనాతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి ఇలా అడ్డంగా బుక్కయ్యాడు.

First published:

Tags: Jasprit Bumrah, Sanjana Ganesan, WTC Final

ఉత్తమ కథలు