Jasprit Bumrah: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా...అదరగొట్టిన రీ ఏంట్రీ

Jasprit Bumrah: టీ20ల్లో ఏడు మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా బుమ్రా కొత్త చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు ఈ రికార్డు శ్రీలంక బౌలర్ నువాన్ కులశేఖర పేరిట ఉండేది.

news18-telugu
Updated: February 2, 2020, 9:29 PM IST
Jasprit Bumrah: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా...అదరగొట్టిన రీ ఏంట్రీ
బుమ్రా (ఫైల్ చిత్రం)
  • Share this:
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో ఏడు మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా బుమ్రా కొత్త చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు ఈ రికార్డు శ్రీలంక బౌలర్ నువాన్ కులశేఖర పేరిట ఉండేది. అతడు 58 టీ20లు ఆడిన కులశేఖర ఆరు మెయిడెన్లు వేశాడు. అయితే సూపర్ ఫామ్ లో ఉన్న బుమ్రా(Jasprit Bumrah)  నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాడు. ఇప్పుడు ఏడు మెయిడెన్లతో బుమ్రా ఆ రికార్డును తిరగరాశాడు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి టీ20లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా ఓ మెయిడెన్ వేయడం ద్వారా ఈ రికార్డును సాధించాడు. కాగా ఈ మ్యాచులో బుమ్రా (Jasprit Bumrah) కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నేల కూల్చడం విశేషం. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా గాయాలతో సతమతమై జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి బుమ్రా, అదరగొట్టే రేంజులో తన సత్తాచాటాడు. బుమ్రా ధాటికి బ్యాట్స్ మెన్ ముప్పు తిప్పలు పడ్డారని టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్ గా పేరొందిన బుమ్రా ఆ స్థానానికి తగిన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టడం విశేషం.

ఇదిలా ఉంటే  మౌంట్ మాంగనుయ్ లో భారత్ జట్టు ఐదో టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కివీస్ సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఓటమి పాలైంది. ఐదు టీ20ల సిరీస్ లో కివీస్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఈ మ్యాచ్ తో కెప్టెన్ కోహ్లీ సైతం రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ అత్యధిక టీ20 సిరీస్‌లు గెలిచిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్ కోహ్లీ సారథ్యంలో టీ20 సిరీస్‌లు గెలవడం విశేషం. కాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఆఖరి 5వ టీ20 మ్యాచ్ లో మెరుపు బౌలింగ్ తో నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన భారత్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కడం విశేషం. అయితే ఇదే సిరీస్ లో 224 పరుగులతో సత్తా చాటిన టీమిండియా ఓపెనర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కించుకున్నాడు.

బుమ్రా రీఎంట్రీ అదుర్స్...
కాగా నాలుగు నెలలుగా గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా స్పీడ్ స్టార్, యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)  శ్రీలంకతో సిరీస్ సమయంలో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సిరీస్ లో సత్తా చాటిన బుమ్రా తన బౌలింగ్ లో ఏమాత్రం వేడి తగ్గలేదని తన ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాడు. 26 ఏళ్ల బుమ్రా గత కొన్నాళ్లుగా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్‌లు సైతం బుమ్రాతో పేస్ బౌలింగ్‌ను పంచుకోవడంతో భారత్ పేస్ దళం గాడిన పడిందనే చెప్పవచ్చు. ఈ దెబ్బతో కోహ్లీ సేన మరిన్ని అప్రతిహత విజయాలు దక్కించుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
First published: February 2, 2020, 9:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading