టీ20 వరల్డ్ కప్‌కు జార్వో 69 మామ రెడీ.. (PC: Twitter)
Jarvo 69: ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియా ఆటగాడిగా పదే పదే మైదనంలోకి ప్రవేశించి అందరి దృష్టిని ఆకర్షించిన జార్వో 69 మామ మళ్లీ వచ్చేశాడు. న్యూజీలాండ్ మ్యాచ్‌లో తన అవసరం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నాడు.
'జార్వో 69' (Jarvo 69).. ఈ పేరును టీమ్ ఇండియా (Team India) క్రికెట్ ఫ్యాన్స్ అంత త్వరగా మర్చిపోలేరు. భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో (England Tour) ఉన్న సమయంలో పదే పదే మైదానంలోకి ఎంట్రీ ఇచ్చి నానా హంగామా చేశాడు. టీమ్ ఇండయా ఆటగాళ్లతో కలసి పోయి ఒకసారి ఫీల్డింగ్ సెట్ చేయడం.. మరో సారి వికెట్ పడగానే బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి వెళ్లిపోవడం.. చివరి సారిగా బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చి ఏకంగా ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను (Johhny Bairstow) ఢీకొట్టడంతో చాలా పాపులర్ అయ్యాడు. అప్పుడే లండన్ పోలీసులు (London Police) జార్వో 69ను అరెస్టు చేసి అతడిపై కేసు నమోదు చేశారు. అంతే కాకుండా అతడికి పలు క్రికెట్ గ్రౌండ్లలో ఎంట్రీపై జీవిత కాలం నిషేధం కూడా విధించారు. అయితే జార్వో 69 వాస్తవానికి ఒక ప్రాంక్ స్టర్. లండన్‌కు చెందిన ఇతడు ఇలాంటి ప్రాంక్స్ చేస్తూ తన యూ ట్యూబ్‌లో పోస్టు చేస్తుంటాడు. ఇంగ్లాండ్ పర్యటన ముగియడంతో జార్వో 69 గురించి పట్టించుకోవడం మానేశారు. అయితే తాజాగా జార్వో 69 టీమ్ ఇండియాకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఓడిపోవడంతో సెమీ ఫైనల్ ఆశలను క్లిష్టతరం చేసుకున్నది. ఆదివారం న్యూజీలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి నెలకొన్నది. అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉన్నది. ఇదే సమయంలో జార్వో మామ మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా టీమ్ ఇండియాకు సహాయం చేస్తానంటూ వచ్చేశాడు. 'ఈ టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియాకు నా అవసరం ఉన్నాదా? నేను నా ఫుల్ కిట్‌తో రెడీగా ఉన్నాను' అంటూ పోస్టు పెట్టాడు. అంతే కాదు టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ధరించి.. ఒక రిప్లికా బ్యాట్‌ను పట్టుకొని ఉన్న సెల్ఫీని పోస్టు చేశాడు. జార్వో 69 ట్వీట్‌పై టీమ్ ఇండియా అభిమానులు స్పందిస్తున్నారు. జార్వో ఉంటే టీమ్ ఇండియాకు లక్ కలసి వస్తుందని ఒకరు అంటే.. కోహ్లీ రాజీమానా చేసి జార్వోకు కెప్టెన్సీ ఇవ్వాలని మరొకరు సరదాగా కామెంటారు. మొత్తానికి జార్వో మరోసారి తనవైపు అందరి దృష్టి పడేలా చేసుకున్నాడు.
జార్వో ఇలాంటి పనులు చేయడం కొత్త కాదట. ఇంతకు ముందు కూడా మనోడి ఇలాంటివి చాలానే చేశాడు. అది ఎప్పుడు జరిగిందన్నది తెలియకపోయినప్పటికి.. వీడియో ప్రకారం అది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ అని తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. బౌలర్ బంతి విసిరిన తర్వాత జార్వో బౌండరీ లైన్‌ను క్రాస్ చేసి మైదానంలోకి వచ్చాడు. ఆ తర్వాత తనతో పాటు తెచ్చుకున్న టెంట్‌ను గ్రౌండ్లో వేసి లోపలికి వెళ్లి నిద్రపోయాడు. ఇదంతా గమనించిన ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. కొన్ని సెకన్ల తర్వాత సెక్యూరిటీ సిబ్బంది టెంట్‌ను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. సరిగ్గా అప్పుడే జార్వో అందులోకి బయటికి వచ్చి తాను అనుకున్నది సాధించినట్టుగా చేతులెత్తి విక్టరీ సింబల్ చూపించాడు. జార్వోవి ఇలాంటి ఆకతాయి పనులు చాలా ఉన్నాయి.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.