హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో అతి చిన్న వయసులో స్వర్ణం గెలిచిన అమ్మాయి.. జపాన్ క్రీడాకారిణి రికార్డు

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో అతి చిన్న వయసులో స్వర్ణం గెలిచిన అమ్మాయి.. జపాన్ క్రీడాకారిణి రికార్డు

అతి చిన్న వయసులో స్వర్ణం గెలిచిన జపాన్ క్రీడాకారిణి (Olympics)

అతి చిన్న వయసులో స్వర్ణం గెలిచిన జపాన్ క్రీడాకారిణి (Olympics)

టోక్యో ఒలింపిక్స్ 2020 (Tokyo Olympics 2020) క్రీడల్లో జపాన్ క్రీడాకారిణి (Japan Athlete) మోమిజి నిషియా (Nishiya Moniji) రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్‌లో అతి చిన్న వయసులోనే వ్యక్తిగత స్వర్ణం గెలిచిన అథ్లెట్‌గా రికార్డులకు ఎక్కింది. ఒలింపిక్స్‌లో ఈ ఏడాది నుంచే స్కేట్ బోర్డింగ్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో మహిళల స్కేట్ బోర్డింగ్‌లో పాల్గొన్న మోమిజి స్వర్ణం గెలిచింది. ఆమె వయసు 13 ఏళ్ల 330 రోజులు. కాగా స్కేట్ బోర్డింగ్‌లో ఫైనల్ చేరిన అమ్మాయిల సగత వయసు 14 ఏళ్లలోపే ఉండటం గమనార్హం. నిషియా స్కేట్ రన్‌లో 3.02 పాయింట్లు.. ట్రిక్‌లో 4.15, 4.66, 3.43 పాయింట్లు.. మొత్తం 15.26 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. మరోవైపు కాంస్య పతకం గెలిచిన జపాన్ అమ్మాయి నకయామా ఫనా వయసు 16 ఏళ్లు. బ్రెజిల్‌కు చెందిన లియాల్ రేసా 14.64 వయసులో రజత పతకం సాధించింది. ఆమె వయసు 13 ఏళ్ల 203 రోజులు.


స్కేట్ బోర్డింగ్ ప్రవేశ పెట్టిన టోక్యో లోనే స్వదేశానికి చెందిన ఇద్దరు పతకాలు గెలవడం గమనార్హం.

First published:

Tags: Tokyo, Tokyo Olympics

ఉత్తమ కథలు