హోమ్ /వార్తలు /క్రీడలు /

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఒసాకా

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఒసాకా

జపాన్ టెన్నిస్ సంచలనం నవోమీ ఒసాకా (Naomi Osaka/ Twitter)

జపాన్ టెన్నిస్ సంచలనం నవోమీ ఒసాకా (Naomi Osaka/ Twitter)

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఇది మరో సంచలనం. 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్ టైటిల్స్ గెలుచుకున్న సెరెనా విలియమ్స్ ఫైనల్‌లో ఓడిపోయింది. తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది జపాన్ యంగ్ ప్లేయర్ ఒసాకా.

యూఎస్ ఓపెన్‌లో ఎవరూ ఊహించని విజయమిది. టెన్నిస్ చరిత్రలో ఓ సంచలనమైన సెరెనా విలియమ్స్ ఫైనల్‌లో చతికిలపడింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న జపాన్ యువ సంచలనం నయోమి ఒసాకా చేతిలో ఓడిపోయింది. టెన్నిస్‌లో పీహెచ్‌డీ చేసిన సెరెనాను... ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న ఒసాకా ఓడించడంతో ప్రపంచం నివ్వెరపోయింది. సెరెనాను 6-2, 6-4 తేడాతో ఓడించింది ఒసాకా.

గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఒసాకా గెలవడం ఇదే తొలిసారి. జపాన్ పురుష ఆటగాళ్లు కూడా ఈ ఘనత సాధించలేదు. ఒసాకా 3.8 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది. 24 గ్రాండ్ స్లామ్‌లు గెలుచుకొని మార్గెరెట్ కోర్ట్ సరసన నిలవాలన్న సెరెనా కల ఫలించలేదు. మరోవైపు సెరెనా తీరు ఈ మ్యాచ్‌లో వివాదాస్పదమైంది. ఎంపైర్‌ను దొంగ అని పిలిచి వివాదంలో చిక్కుకుంది సెరెనా.

First published:

Tags: US Open 2018

ఉత్తమ కథలు