టెస్ట్‌ల్లో జేమ్స్ యాండర్సన్ లేటెస్ట్ రికార్డ్

ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ యాండర్సన్ టెస్ట్‌ల్లో ఆల్ టైమ్ టాప్ వికెట్ల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. 564 టెస్ట్ వికెట్లతో జేమ్స్ ఆస్ట్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డ్ బ్రేక్ చేశాడు.

news18-telugu
Updated: September 12, 2018, 7:05 PM IST
టెస్ట్‌ల్లో జేమ్స్ యాండర్సన్ లేటెస్ట్ రికార్డ్
ఇంగ్లండ్ టెస్ట్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ (Twitter/ICC)
  • Share this:
ఇంగ్లండ్ స్పీడ్ గన్ జేమ్స్ యాండర్సన్..లేటు వయసులోనూ అద్భుతాలు చేస్తున్నాడు. 36 ఏళ్ల వయసులో ఉన్న ఎక్కువ మంది క్రికెటర్లు ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి ఇప్పటికే రిటైరై ఉంటారు. ఇక పేస్ బౌలర్లైతే 30 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ గురించే ఆలోచిస్తుంటారు. కెరీర్ ఆరంభం నుంచే ఫిట్‌నెస్‌ సమస్యలెదుర్కొనే పేస్ బౌలర్లు 30 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగినా అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమవుతుంటారు. ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ యాండర్సన్ మాత్రం 36 ఏళ్ల వయసులోనూ బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. వన్డే,టీ20 ఫార్మాట్లకు దూరంగా ఉన్న యాండర్సన్ ప్రస్తుతం టెస్ట్‌ ఫార్మాట్‌లో మాత్రమే ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ ఆల్ టైమ్ టాప్ వికెట్ టేకర్‌గా ఉన్న జిమ్మీ ఓవల్ టెస్ట్‌తో ఇప్పటివరకూ మరే ఇతర పేస్ బౌలర్‌కు సాధ్యం కాని రికార్డ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఓవల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు,సెకండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు.రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న జిమ్మీ..టెస్ట్‌ల్లో ఆల్ టైమ్ టాప్ వికెట్ల వీరుల జాబితాలో టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నాడు.
ఓవల్ టెస్ట్ నాల్గవ ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా వికెట్ తీయడం ద్వాదా యాండర్సన్ వికెట్ల సంఖ్య 563కు చేరింది.అదే ఇన్నింగ్స్‌లో మహ్మద్ షమీని ఔట్ చేయడం ద్వారా టెస్ట్‌ల్లో 564 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.564 టెస్ట్ వికెట్లతో ఆస్ట్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డ్ బ్రేక్ చేశాడు.గత పదకొండేళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న మెక్‌గ్రాత్ 563 వికెట్ల రికార్డ్‌ బద్దలు కొట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతంచేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేస్ బౌలర్‌గా రికార్డ్‌లకెక్కాడు.ఈ ఫీట్‌తో టెస్ట్ ఆల్ టైమ్ హయ్యస్ట్ వికెట్స్ తీసిన బౌలర్ల లిస్ట్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు.


ఇండియాతో సిరీస్‌లోనే యాండర్సన్ పలు రికార్డ్‌లు బద్దలు కొట్టాడు.ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో 100 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.ఒకే వేదికపై 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా యాండర్సన్ రికార్డ్‌లకెక్కాడు.ఒకే వేదికలో వందకు పైగా వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్ యాండర్సన్ మాత్రమే.
36 ఏళ్ల వయసులోనూ తనలో ఏ మాత్రం పదును తగ్గలేదని ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ యాండర్సన్ నిరూపిస్తున్నాడు.జెంటిల్మన్ గేమ్ క్రికెట్‌లో ఫామ్ ఈజ్ టెంపరరీ..క్లాస్ ఈజ్ పర్మనెంట్ అనడానికి లేటు వయసులోనూ యాండర్సన్‌ ప్రదర్శనే నిదర్శనం.ఇవీ చదవండి:

ఇంగ్లండ్‌‌‌‌‌లో మరో సిరీస్ మిస్ చేసుకున్న ఇండియా
Loading...
ఇంగ్లండ్ టూర్‌లో విరాట్ సేన నాలుగు మ్యాచ్‌లే నెగ్గింది!!
First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...