JAMAICAN MYSTERY OFF SPIN BOWLER MCCARTHY TAKES HIS 1ST EVER LIST A HAT TRICK WATCH VIDEO SRD
Viral Video : అదరగొట్టిన మరో మిస్టరీ స్పిన్నర్...హ్యాట్రిక్ తో సహా ఆరు వికెట్లు..వైరల్ వీడియో
Photo Credit : Twitter
Viral Video : అప్పుడప్పుడూ క్రికెట్లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. ఈ జెంటిల్ మేన్ గేమ్ లో ఒక్క రోజులో హీరో అవ్వొచ్చు. అలాగే జీరో కూడా అవ్వొచ్చు.
అప్పుడప్పుడూ క్రికెట్లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. ఈ జెంటిల్ మేన్ గేమ్ లో ఒక్క రోజులో హీరో అవ్వొచ్చు. అలాగే జీరో కూడా అవ్వొచ్చు. కానీ, వెస్టిండీస్ కు చెందిన ఓ మిస్టరీ స్పిన్నర్ తన అద్భుత ప్రదర్శనతో హీరోగా నిలిచాడు. ఓ హ్యాట్రిక్ తో సహా ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకుని వారెవ్వా అన్పించాడు. ఈ ఘటన వెస్టిండీస్ లిస్ట్ ఏ క్రికెట్ లో జరిగింది. ఆ మిస్టరీ స్పిన్నర్ పేరు ఆండ్రూ మెక్కార్తి. జమైకన్ కు చెందిన ఈ మిస్టరీ ఆఫ్ స్పిన్నర్ లిస్ట్ ఏ క్రికెట్ లో అరుదైన ఫీట్ ను సొంతం చేసుకున్నాడు. తన కెరీర్ లో ఫస్ట్ హ్యాట్రిక్ తో పాటు ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జమైకన్, బార్బోడస్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ ఫీట్ నమోదైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జమైకా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 218 పరుగులు చేసింది. పదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఓడెన్ స్మిత్ హాఫ్ సెంచరీ చేయడంలో ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది జమైకా జట్టు.
తర్వాత బ్యాటింగ్ కు దిగిన బార్బోడస్ జట్లు ఫస్ట్ దూకుడుగా తమ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఎప్పుడైతే, మెక్కార్తి బాల్ తన చేతిలోకి తీసుకున్నాడో..అప్పుడే బార్బోడస్ జట్టు ఓటమి ఖాయమైంది. 40 వ ఓవర్లలో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. దీంతో ఫస్ట్ హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు మెక్కార్తీ. తన పదునైన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు ఆండ్రూ మెక్కార్తి. అతడి సూపర్ బౌలింగ్ వీడియోను విండీస్ క్రికెట్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరలవుతోంది.
మెక్కార్తి దెబ్బకు బార్బోడస్ జట్టు 167 పరుగులకే ఆలౌటై అయింది. దీంతో 51 పరుగుల తేడాతో జమైకా జట్టు గెలిచింది. మెక్కార్తి 9.1 ఓవర్లలో 19 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. దీంతో అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.