IND vs NZ : న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌పై సచిన్ టెండుల్కర్ అభిప్రాయం ఇదీ...

India vs New Zealand Semi-final World Cup 2019 : సెమీఫైనల్‌లో ఇండియా గెలిచివుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఓటమి సందర్భంగా... వెటరన్ క్రికెటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంఎస్ ధోనీని గేమ్ ఫినిషర్‌గా భావించడం కరెక్టు కాదన్నాడు సచిన్ టెండుల్కర్.

Krishna Kumar N | news18-telugu
Updated: July 11, 2019, 8:27 AM IST
IND vs NZ : న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌పై సచిన్ టెండుల్కర్ అభిప్రాయం ఇదీ...
సచిన్ టెండుల్కర్ (File)
  • Share this:
టీంఇండియాలో ఓ తప్పుడు అభిప్రాయం బలపడిపోయింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు... MS ధోనీ ఎంటరైతే... ఇక కష్టాలన్నీ గట్టెక్కి... గేమ్ ఫినిష్ చేస్తాడనే ఫీలింగ్ ఉంది. తాజాగా న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్‌లో కూడా అదే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు తగ్గట్టుగానే... జడేజాతో జట్టుకట్టి... ధోనీ వీరోచితంగా పోరాడాడు. అతని పోరాటం వెటరన్ క్రికెటర్లను కూడా మెచ్చుకునేలా చేసింది. ముఖ్యంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్... టీమిండియా బ్యాటింగ్ లైనప్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎప్పుడూ టాప్ ఆర్డరే బాగా ఆడుతుందనీ, మిడిల్ ఆర్డర్‌ను తక్కువ అంచనా వెయ్యడం కరెక్టు కాదన్నాడు. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు... టాప్ ఆర్డర్‌లో ముగ్గురు వికెట్లు పడిపోయినప్పుడు... ధోనీని ఏడో పొజిషన్‌లో దింపడం కరెక్టు కాదన్నాడు సచిన్.

ప్రతిసారీ రోహిత్, విరాట్ లాంటి వారినే టాప్ ఆర్డర్లుగా బరిలో దింపడం సరికాదన్న సచిన్... మిగతా ప్లేయర్లు కూడా ఆట విషయంలో బాధ్యతగా వ్యవహరించాలన్నాడు. సెమీఫైనల్‌లో కివీస్... 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేయగా... 240 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోహ్లీ సేన... 49.3 ఓవర్లలో ఆల్ అవుట్ అయ్యి... 221 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. ప్రధానంగా 92 పరుగులకే కివీస్... 6 వికెట్లు తియ్యడంతో... టీమిండియా కోలుకోలేకపోయింది. ఆ సమయంలో... ధోనీ (50), జడేజా (77) భాగస్వామ్యం ఏడో వికెట్ పడేనాటికి 116 పరుగులు చేర్చింది.

మరోసారి ధోనీ తనవంతుగా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడన్న సచిన్... టాప్ ఆర్డర్ సరిగా ఆడివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నాడు. అటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా తెలివిగా ఆడి... బౌలింగ్‌తో టీమిండియాను కట్టడి చేయగలిగాడనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
First published: July 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు