Home /News /sports /

ITALY WON THE EURO 2020 TILE AFTER 53 YEARS ITALY WON EUTO TITLE FOR FIRST TIME JNK

Euro 2020 : 53 ఏళ్ల తర్వాత యూరో కప్ గెలిచిన ఇటలీ.. హోం గ్రౌండ్‌లో ఓడిపోయిన ఇంగ్లాండ్..

53 ఏళ్ల తర్వాత యూరో కప్ గెలిచిన ఇటలీ (Twitter)

53 ఏళ్ల తర్వాత యూరో కప్ గెలిచిన ఇటలీ (Twitter)

కరోనా మహమ్మారి కారణంగా ఏడాది ఆలస్యంగా జరిగిన యూరో 2020లో ఇటలీ చాంపియన్లుగా నిలిచారు. 1968లో తొలి సారి విజేతలుగా నిలిచిన ఇటలీ జట్టు 53 ఏళ్ల తర్వాత మరోసారి యూరో కప్ గెలుచుకున్నది.

    యూరో కప్ 2020ని (Euro 2020) ఇటలీ (Italy) గెలుచుకున్నది. ఆదివారం రాత్రి లండన్‌లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో (England) జరిగిన మ్యాచ్‌లో ఇటలీ జట్టు పెనాల్టీ షూటవుట్‌లో (Penalty Shootout) గెలిచి యూరో 2020 చాంపియన్లుగా (Champions) నిలిచారు. 1968లో తొలి సారి యూరో కప్ విజేతగా నిలిచిన ఇటలీ జట్టు 53 ఏళ్ల తర్వాత మరోసారి టైటిల్ దక్కించుకున్నది. 1968 యూరో సెమీస్‌లో యుగోస్లేవియా చేతిలో ఓడిన ఇంగ్లాండ్.. 53 ఏళ్ల తర్వాత ఇటలీ చేతిలో ఫైనల్స్‌లో ఓడటం గమనార్హం. ఆదివారం రాత్రి లండన్‌లోని వింబ్లే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇటలీ, ఇంగ్లాండ్ జట్టు తలపడ్డాయి. మ్యాచ్ ప్రారంభమైన తొలి నిమిషంలోనే ఇటలీకి కార్నర్ లభించింది. కానీ ఆ కార్నర్‌ను అద్భుతంగా అడ్డుకున్న ఇంగ్లాండ్ జట్టు కౌంటర్ అటాక్ చేసింది. అత్యంత వేగంగా ఇటలీ గోల్ పోస్టు వైపు వెళ్లిన లూక్ షా ఇంగ్లాండ్ జట్టుకు తొలి గోల్ అందించాడు. ఆట ప్రారంభమైన రెండో నిమషంలోనే గోల్ రావడంతో వింబ్లే స్టేడియంలో కేరింతలు మిన్నంటాయి. అదే ఊపులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇటలీ హాఫ్ లోకి వచ్చి గోల్స్ చేయడానికి ప్రయత్నించారు. అయితే బలమైన డిఫెన్స్ ఉన్న ఇటలీ వారిని అడ్డుకున్నది. అదే సమయంలో 0-1 తేడాతో వెనకబడి ఉండటంలో ఇటలీ డిఫెన్స్ ఆటకే ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో తొలి అర్దభాగంలో మరో గోల్ రాలేదు. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంతో నిలిచింది.

    రెండో అర్దభాగంలో ఇటలీ బంతిని ఎక్కువగా తమ ఆధీనంలోనే ఉంచుకున్నది. సాధ్యమైనంత వరకు ఇంగ్లాండ్ గోల్ పోస్టుపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో 67వ నిమిషంలో లియోనార్డో బొనౌసీ గోల్ చేసి 1-1తో స్కోర్ సమం చేశాడు. గోల్ పోస్టుకు తగిలి రీబౌండ్ అయిన బంతిని గోల్ చేసి ఇటలీకి తిరుగుల లేని ఆత్మవిశ్వాసాన్ని తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత నిర్ణీత 90 నిమిషాల వరకు ఇరు జట్లు మరో గోల్ చేయలేదు. దీంతో ఆటను మరో 30 నిమిషాలు పొడిగించారు. ఈ సమయంలో కూడా ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. నిర్ణీత 90+30 సమయం మించిపోవడంతో రిఫరీ మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు మళ్లించారు.







    పెనాల్టీ షూటవుట్‌లో టాస్ గెలిచి ఇటలీ తొలి స్ట్రైక్ తీసుకున్నది. ఇందులో ఇటలీ 3-2 తేడాతో విజయం సాధించింది. పెనాల్టీ షూటవుట్ ఇలా సాగింది.

    - ఇటలీ తొలి స్ట్రైక్ డోమినిగో బెరార్డీ తీసుకొని గోల్ చేశాడు.
    - ఇంగ్లాండ్ తొలి స్ట్రైక్ కెప్టెన్ హారీ కేన్ తీసుకొని గోల్ చేశాడు.

    - ఇటలీ రెండో స్ట్రైక్ తీసుకున్న బెలోటీని ఇంగ్లాండ్ కీపర్ అడ్డుకున్నాడు.
    - ఇంగ్లాండ్ రెండో స్ట్రైక్ తీసుకున్న మగూరి గోల్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ లీడ్‌లోకి వెళ్లింది.

    - ఇటలీ మూడో స్ట్రైక్ తీసుకున్న బనౌసీ గోల్ చేశాడు.
    - ఇంగ్లాండ్ మూడో స్ట్రైక్ తీసుకున్న రాష్‌ఫోర్డ్ గోల్ చేయలేక పోయాడు.

    - ఇటలీ నాలుగో స్ట్రైక్ తీసుకున్న బెర్నార్డెసీ గోల్ చేశాడు.
    - ఇంగ్లాండ్ నాలుగో స్ట్రైక్ తీసుకున్న సాంచోను గోల్ కీపర్ డొనరూమ అడ్డుకున్నాడు.

    - ఇటలీ ప్లేయర్ జోరిగినో ఈ గోల్ కొడితే గెలిచేది. కానీ ఇంగ్లాండ్ గోల్ కీపర్ పిక్ ఫోర్డ్ ఆపేశాడు.
    - అయితే కీలకమైన సాకా గోల్‌ను డొనరొమా ఆపేయడంతో పెనాల్టీ షూటవుట్‌లో ఇటలీ 3-2 తేడాతో యూరోకప్ గెలిచింది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: EURO 2020, Euro Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు