ట్రోఫీ గెలిచిన ఆనందంలో మహిళ వాలీబాల్ టీమ్ సభ్యులు గదిలోకి వెళ్లి ఏం చేసారంటే...

ఫైనల్ మ్యాచ్ లో ట్రోఫి అందుకున్న ఇమోకో టీమ్ సభ్యులు వెంటనే డ్రెస్సింగ్ రూమ్ లోకి పరిగెత్తారు. అనంతరం సంబరాలు చేసుకుంటున్న టీం సభ్యులు ఒళ్లు మైమరిచి ఒంటి మీద ఉన్న దుస్తులు వదలడం ప్రారంభించారు.

news18-telugu
Updated: May 17, 2019, 5:24 PM IST
ట్రోఫీ గెలిచిన ఆనందంలో మహిళ వాలీబాల్ టీమ్ సభ్యులు గదిలోకి వెళ్లి ఏం చేసారంటే...
మహిళా ఇటలీ వాలీబాల్ టీమ్ ( Image : Joanna Wołosz / instagram)
news18-telugu
Updated: May 17, 2019, 5:24 PM IST
ఇటలీకి చెందిన మహిళా వాలీబాల్ టీమ్ ఇమోకో వాలీ సభ్యులు చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో వింతగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. ఫైనల్ మ్యాచ్ లో ట్రోఫి అందుకున్న ఇమోకో టీమ్ సభ్యులు వెంటనే డ్రెస్సింగ్ రూమ్ లోకి పరిగెత్తారు. అనంతరం సంబరాలు చేసుకుంటున్న టీం సభ్యులు ఒళ్లు మైమరిచి ఒంటి మీద ఉన్న దుస్తులు వదలడం ప్రారంభించారు. కాసేపటికే అంతా నగ్నంగా మారి సంబరాలు చేసుకున్నారు. అయితే ఇదంతా ప్రైవేటు వ్యవహారంలో నాలుగు గోడల మధ్యలో ముగిసిపోతే బాగుండేది. కానీ ఇమోకో ప్లేయర్స్ మరింత రెచ్చిపోయి నగ్నంగా ఉన్న ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ చేశారు. ఇంకే ముంది క్షణాల్లోనే ప్రపంచమంతా సంచలనంగా మారింది. నిజానికి ఫైనల్ మ్యాచ్ లో ఇమోకో జట్టు చివరి నిమిషం వరకూ పోరాడి విజయం సాధించింది. అయితే జట్టు సభ్యులు చేసిన పనికి టీమ్ మేనేజ్ మెంట్ కూడా వివిరణ కోరింది. ఇదిలా ఉంటే ఇమోకో జట్టు సభ్యులు మాత్రం ఇందులో తప్పేమి లేదని వివరణ ఇచ్చింది. తమ సంతోషాన్ని వ్యక్తం చేసేందుకే ఇలా వినూత్నంగా సెలెబ్రేట్ చేసుకున్నామని టీమ్ సభ్యురాలు జోనా వోల్జ్ పేర్కొంది. ఇదిలా ఉంటే 2012 తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం మరోసారి టోర్నీ గెలుచుకున్నట్లు టీమ్ మేనేజ్ మెంట్ పేర్కొంది.

( Image : Joanna Wołosz / instagram)


( Image : Joanna Wołosz / instagram)


ఇదిలా ఉంటే ఇటలీలోని క్రీడా వర్గాలు మాత్రం ఇమోకో సభ్యులు చేసిన పనిని తప్పుపడుతున్నారు. ఇలా చేయడం ద్వారా క్రీడా స్ఫూర్తి దెబ్బతింటుందని అన్నారు. అలాగే భవిష్యత్ తరాలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. అలాగే క్రీడల్లో గెలుపోటములు సహజమేనని అయితే గెలుపును ఆస్వాదించేందుకు ఇలాంటి వింత ప్రవర్తన చేస్తే గౌరవం కోల్పోతారని నెటిజన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...