అది మూర్ఖత్వమే.. రోహిత్‌పై కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు..

వ్యక్తిగతంగా తన ప్రదర్శనపై తాను సంతోషంగా ఉన్నానని.. అయితే ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని అన్నాడు. ప్రతీ ఇన్నింగ్స్‌లో తనను తాను మరింత మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని కేఎల్ రాహుల్ అన్నాడు.

news18-telugu
Updated: July 4, 2019, 3:56 PM IST
అది మూర్ఖత్వమే.. రోహిత్‌పై కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు..
కేఎల్ రాహుల్,రోహిత్ శర్మ(File Photo)
  • Share this:
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ ప్రత్యేక బ్యాట్స్‌మెన్ అని, అతని శైలిని అనుకరించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. అతను క్రీజులో దూకుడుగా ఆడుతున్నప్పుడు మరో గ్రహం నుంచి వచ్చిన వ్యక్తిలా అనిపిస్తాడని.. భిన్నమైన
క్లాస్‌తో అదరగొట్టడం అతని శైలి అని పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తన ప్రదర్శనపై తాను సంతోషంగా ఉన్నానని.. అయితే ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని అన్నాడు. ప్రతీ ఇన్నింగ్స్‌లో తనను తాను మరింత మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని కేఎల్ రాహుల్ అన్నాడు.

వ్యక్తిగతంగా 60,70 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. మరికొద్దిసేపు క్రీజులో నిలదొక్కుకోగలిగితే భారీ స్కోరు సాధించగలనని, దానిపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నాడు. ఈ విషయంలో బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సలహాలు సూచనలు కూడా పాటిస్తున్నానని తెలిపాడు.కాగా, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 77 పరుగులతో రాహుల్ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. శిఖర్ ధావన్ స్థానంలో టీమ్‌లోకి వచ్చిన రాహుల్ మొదటి రెండు మ్యాచ్‌లలో స్వల్ప స్కోర్లతో నిరాశపరిచినప్పటికీ.. ఆ తర్వాతి మ్యాచ్‌లలో వరుసగా 57, 30, 48, 0, 77 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో కనబరిచిన ఫామ్‌నే తర్వాతి మ్యాచ్‌లలోనూ కొనసాగించాలని రాహుల్ భావిస్తున్నాడు.First published: July 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>