Home /News /sports /

IT SEEMS THAT RAVI SHASTRI WILL BE THE COACH OF THE AHMEDABAD FRANCHISE NEXT YEAR IN THE INDIAN PREMIER LEAGUE PRV

IPL: ఐపీఎల్​ కోచ్​గా మారనున్న రవిశాస్త్రి.. భారీ ఆఫర్​ ప్రకటించిన అహ్మదాబాద్​ ఫ్రాంఛైజీ?

రవిశాస్త్రి (ఫైల్​ ఫొటో)

రవిశాస్త్రి (ఫైల్​ ఫొటో)

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (Indian premier league​)లో వచ్చే సంవత్సరం రెండు కొత్త జట్లు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి రవిశాస్త్రి  (Ravi shastri) కోచ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీగా ఆఫర్​ ప్రకటించినట్లు సమాచారం.

ఇంకా చదవండి ...
ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (Indian premier league​)లో వచ్చే సంవత్సరం రెండు కొత్త జట్లు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి రవిశాస్త్రి  (Ravi shastri) కోచ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్త ఐపీఎల్ (IPL) జట్ల యజమానులు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న కోచ్‌లను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే రవిశాస్త్రి ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టారు. కప్ అయిపోయాక తన నిర్ణయం చెబుతామని ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

రవిశాస్త్రికి భారీ ఆఫర్​..

రవిశాస్త్రి ఐపీఎల్ టీంకు కోచ్‌ (coach)గా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రవిశాస్త్రికి కామెంటేటర్‌గా మంచి పేరుంది. కోచ్ పదవిలోకి రాకముందు 20 సంవత్సరాల పాటు అతను క్రికెట్ కామెంటేటర్‌గా విధులు నిర్వర్తించారు. ఇదే సమయంలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రమోటర్లు అయిన సీవీసీ క్యాపిటల్స్ టీమ్ కల్చర్‌ను మొదటి నుంచి ఏర్పాటు చేయాలనుకుంటున్నాయి. రిటెన్షన్ నిబంధనలు (retention conditions) కూడా ఉన్నాయి కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రొఫెషనల్స్ ఉండాలని జట్టు అనుకుంటోంది. దీంతోపాటు ఫ్రాంచైజీకి సీఈవో, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌ను కూడా తీసుకోవాలని సీవీసీ క్యాపిటల్స్ (CVC Capitals) అనుకుంటోంది. ఇందుకు సంబంధించి  ఆ జట్టు ప్రతినిధులు ఇప్పటికే శాస్త్రిని సంప్రదించి భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి శాస్త్రి నిర్ణయం ఏమిటన్నది ఇప్పటికైతే సస్పెన్స్. యూఏఈ (UAE) నుంచి తిరిగొచ్చిన  తర్వాత శాస్త్రి దీనిపై తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

రవిశాస్త్రి, అరుణ్, శ్రీధర్ కూడా..

రవిశాస్త్రి 2014లో భారత జట్టుకి కోచ్‌ (head coach)గా వచ్చాడు. ఈ ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి, అరుణ్, శ్రీధర్ కూడా జట్టును వీడాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ హెడ్ కోచ్‌గా నియమించింది. శాస్త్రితో పాటు టీమిండియా (Team India)కు బౌలింగ్ కోచ్ గా ఉన్న భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ లకు కూడా ఐపీఎల్ లో భారీ డిమాండ్ ఏర్పడింది. గత కొన్నాళ్లుగా రవిశాస్త్రి సారథ్యంలోని భారత శిక్షక బృందం.. ఆటగాళ్లను సానబెడుతున్నది.  ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించడం.. విదేశాల్లో టెస్టు సిరీస్ లు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భారత్ ఫైనల్ కు చేరడం.. ఇలా ఇవన్నీ శాస్త్రి, అతడి సహాయక బృందం హయాంలో జరిగినవే కావడంతో వారికి డిమాండ్ భారీగా ఉంది.

ఐపీఎల్ జట్టుకు కోచ్‌గా ఉంటే రవిశాస్త్రికి కామెంటరీ చెప్పే అవకాశం ఉండదు. ప్రస్తుతం బీసీసీఐ కాన్‌ఫ్లిక్ ఆఫ్ ఇంట్రస్ట్ నియమాల ప్రకారం.. ఒక జట్టుకు కోచ్‌గా ఉంటూ మరో బ్రాడ్‌కాస్టర్‌తో ఒప్పందం కుదుర్చుకోకూడదు. అయితే గతంలో వీవీఎస్ లక్ష్మణ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్‌గా ఉంటూనే.. కామెంటరీ కూడా చెప్పారు. ప్రస్తుతం రవిశాస్త్రికి స్టార్ స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్ వంటి పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు ఉన్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Ahmedabad, IPL, Ravi Shastri

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు