కోహ్లీ లేడని టీమిండియాను తేలికగా తీసుకోలేము...బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్

పర్యటనలో వీలైనంత వరకు అన్ని విభాగాల్లో చక్కటి ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తామని అన్నాడు. కోహ్లీ లేని కారణంగా టీమిండియా జట్టు బలహీనపడుతుందని తాము భావించడం లేదన్నాడు.

news18-telugu
Updated: November 1, 2019, 8:39 PM IST
కోహ్లీ లేడని టీమిండియాను తేలికగా తీసుకోలేము...బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్
విరాట్ కోహ్లి
  • Share this:
భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ ఢిల్లీలో టీమిండియాతో తొలి టీ20 మ్యాచ్ లో తలబడుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నూతన కెప్టెన్ లిటన్‌దాస్ మాట్లాడుతూ..టీమిండియాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ లేడని తాము అజాగ్రత్తగా ఉండమని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ పర్యటనలో వీలైనంత వరకు అన్ని విభాగాల్లో చక్కటి ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తామని అన్నాడు. కోహ్లీ లేని కారణంగా టీమిండియా జట్టు బలహీనపడుతుందని తాము భావించడం లేదన్నాడు. టీమిండియాలో సమర్థులైన ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే తమ జట్టులో మాత్రం సీనియర్ ఆటగాళ్లు లేకపోవడం కొద్దిగా ఇబ్బంది అని, అయినా గెలుపు కోసం ప్రయత్నిస్తామని అన్నాడు. కాగా ఈ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మకు జట్టు పగ్గాలు అప్పగించారు. ఇదిలా ఉంటే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈ నెల 3న భారత్-బంగ్లాదేశ్ మధ్య ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు కఠోర ప్రాక్టీస్ చేస్తున్నాయి.

First published: November 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>