హోమ్ /వార్తలు /క్రీడలు /

ISL 2022-23 : డిఫెండింగ్ చాంపియన్ గా హైదరాబాద్.. ఇండియన్ సూపర్ లీగ్ లో మన టీం షెడ్యూల్ ఇదే

ISL 2022-23 : డిఫెండింగ్ చాంపియన్ గా హైదరాబాద్.. ఇండియన్ సూపర్ లీగ్ లో మన టీం షెడ్యూల్ ఇదే

PC : TWITTER

PC : TWITTER

ISL 2022-23 : ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫుట్ బాల్ టోర్నమెంట్ కొత్త సీజన్ మన ముందుకు రాబోతుంది. అక్టోబర్ 7న ఇండియన్ సూపర్ లీగ్ 2022-23  సీజన్ కు తెర లేవబోతుంది. తొలి మ్యాచ్ లో కేరళ బ్లాస్టర్స్ (Kerala Blasters), ఈస్ట్ బెంగాల్ (East Bengal) జట్ల మధ్య జరగనుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ISL 2022-23 : ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫుట్ బాల్ టోర్నమెంట్ కొత్త సీజన్ మన ముందుకు రాబోతుంది. అక్టోబర్ 7న ఇండియన్ సూపర్ లీగ్ 2022-23  సీజన్ కు తెర లేవబోతుంది. తొలి మ్యాచ్ లో కేరళ బ్లాస్టర్స్ (Kerala Blasters), ఈస్ట్ బెంగాల్ (East Bengal) జట్ల మధ్య జరగనుంది. మొత్తం 11 జట్లు ఈ సీజన్ చాంపియన్ షిప్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ గా హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్ (Hyderabad FC) బరిలోకి దిగనుంది. గత సీజన్ ఫైనల్లో హైదరాబాద్ జట్టు 3-1 తేడాతో కేరళ బ్లాస్టర్స్ ను పెనాల్టీ షూటౌట్ లో ఓడించి చాంపియన్ గా నిలిచింది. హైదరాబాద్ తన ఆరంభ పోరును అక్టోబర్ 9న ముంబై సిటీతో తలపడనుంది.

జట్టును కోచ్ మాన్యుయెల్ మార్కజ్ అన్ని తానై నడిపిస్తున్నాడు. 2019లో తొలి సీజన్ ను ఆడిన హైదరాబాద్ ఆ సీజన్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అనంతరం 2020-2021 సీజన్ కోసం మార్కజ్ ను హెడ్ కోచ్ గా నియమించుకుంది. అతడి పర్యవేక్షణలో 2020-2021లో హైదరాబాద్ అదరగొట్టింది. ఎవరూ ఊహించని విధంగా సీజన్ ను 5వ స్థానంత ోముగించింది. ఇక అనంతరం జరిగిన 2021-2022 సీజన్ లో ఏకంగా చాంపియన్ గా నిలిచి ఔరా అనిపించింది. ఈసారి కరోనా తగ్గుముఖం పట్టడంతో పాత పద్దతిలోనే లీగ్ జరగనుంది. హోం, అవే పద్దతిలో ప్రతి జట్టు కూడా మిగిలిన 10 జట్లతో రెండేసి మ్యాచ్ లను ఆడనుంది.

హైదరాబాద్ షెడ్యూల్

ఎప్పుడుఎవరితోవేదికసమయం
అక్టోబర్ 9ముంబై సిటీజీఎంసీ బాలయోగి స్టేడియం (హైదరాబాద్)రాత్రి గం. 7.30
అక్టోబర్ 13నార్త్ ఈస్ట్ యునైటెడ్ఇందిరా గాంధీ స్టేడియం (గుహవటి)రాత్రి గం. 7.30
అక్టోబర్ 22బెంగళూరుజీఎంసీ బాలయోగి స్టేడియం (హైదరాబాద్)రాత్రి గం. 7.30
అక్టోబర్ 29గోవాజీఎంసీ బాలయోగి స్టేడియం (హైదరాబాద్)సా. గం. 5.30
నవంబర్ 5ఒడిషాజీఎంసీ బాలయోగి స్టేడియం (హైదరాబాద్)సా. గం. 5.30
నవంబర్ 12జంషెడ్ పూర్టాటా స్పోర్ట్స్ కాంప్లెక్స్ (జంషెడ్ పూర్)సా. గం. 5.30
నవంబర్ 19కేరళ బ్లాస్టర్స్జీఎంసీ బాలయోగి స్టేడియం (హైదరాబాద్)రాత్రి గం. 7.30
నవంబర్ 26ఏటీకే మోహన్ బగాన్సాల్ట్ లేక్ స్టేడియం (కోల్ కతా)రాత్రి గం. 7.30
డిసెంబర్ 3చెన్నైయిన్జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం (చెన్నై)రాత్రి గం. 7.30
డిసెంబర్ 9ఈస్ట్ బెంగాల్జీఎంసీ బాలయోగి స్టేడియం (హైదరాబాద్)రాత్రి గం. 7.30
డిసెంబర్ 23బెంగళూరుశ్రీ కాంతిరవ స్టేడియం (బెంగళూరు)రాత్రి గం. 7.30
డిసెంబర్ 29నార్త్ ఈస్ట్ యునైటెడ్జీఎంసీ బాలయోగి స్టేడియం (హైదరాబాద్)రాత్రి గం. 7.30
జనవరి 5గోవాజవహర్ లాల్ నెహ్రూ స్టేడియం (గోవా)రాత్రి గం. 7.30
జనవరి 12చెన్నైయిన్జీఎంసీ బాలయోగి స్టేడియం (హైదరాబాద్)రాత్రి గం. 7.30
జనవరి 20ఈస్ట్ బెంగాల్సాల్ట్ లేక్ స్టేడియం (కోల్ కతా)రాత్రి గం. 7.30
ఫిబ్రవరి 4ముంబై సిటీముంబై ఫుట్ బాల్ ఎరీనా (ముంబై)సా.గం. 5.30
ఫిబ్రవరి 10ఒడిషాకళింగ స్టేడియం (భువనేశ్వర్)రాత్రి గం. 7.30
ఫిబ్రవరి 14ఏటీకే మోహన్ బగాన్జీఎంసీ బాలయోగి స్టేడియం (హైదరాబాద్)రాత్రి గం. 7.30
ఫిబ్రవరి 18జంషెడ్ పూర్జీఎంసీ బాలయోగి స్టేడియం (హైదరాబాద్)సా.గం. 5.30
ఫిబ్రవరి 26కేరళ బ్లాస్టర్స్జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం (కొచ్చి)రాత్రి గం. 7.30

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: FIFA, Foot ball, Hyderabad, India vs South Africa, Indian Super League

ఉత్తమ కథలు