Home /News /sports /

Ishan Kishan: సచిన్‌ను చూసి భయపడ్డ ఇషాన్ కిషన్.. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వులు తెప్పించిన సంఘటన

Ishan Kishan: సచిన్‌ను చూసి భయపడ్డ ఇషాన్ కిషన్.. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వులు తెప్పించిన సంఘటన

డ్రెస్సింగ్ రూమ్‌లో సచిన్ టెండుల్కర్‌ను చూసి భయపడిన ఇషాన్ కిషన్ (PC: Mumbai Indians)

డ్రెస్సింగ్ రూమ్‌లో సచిన్ టెండుల్కర్‌ను చూసి భయపడిన ఇషాన్ కిషన్ (PC: Mumbai Indians)

Ishan Kishan: డ్రెస్సింగ్ రూమ్‌లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌ను చూసి ఇషాన్ కిషన్ భయపడిపోయాడు. ఇది చూసి సహచర క్రికెటర్లు నవ్వుల్లో మునిగిపోయారు. అసలేం జరిగిందంటే..

    ముంబై ఇండియన్స్ (Mumbai Indians) క్రికెటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఇప్పుడిప్పుడే మంచి బ్యాటర్‌గా వెలుగులోకి వస్తున్నాడు. గత సీజన్‌లో ముంబై తరపున అదరగొట్టిన కిషన్.. ప్రస్తుత సీజన్‌లో మాత్రం ఫామ్ కోల్పోయాడు. భారత టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) జట్టులో కూడా స్థానం సంపాదించిన కిషన్ ఫామ్ ప్రస్తుతం అందరినీ ఆందోళనలో పడేసింది. కెప్టెన్ కోహ్లీ (Virat Kohli) కూడా ఇషాన్ కిషన్‌కు ఇటీవల పలు సూచనలు చేయడం టీవీల్లో చూశాం. ఇక అసలు విషయానికి వస్తే ఇషాన్ కిషన్ డ్రెస్సింగ్ రూమ్‌లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌ను (Sachin Tendulkar) చూసి భయపడిపోయాడు. మ్యాచ్ కోసం స్టేడియంకు వచ్చిన తర్వాత బస్సు దిగి బ్లాక్ సన్‌గ్లాసెస్... చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకొని చాలా క్యాజువల్‌గా ఇషాన్ కిషన్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చాడు. అక్కడ ఆల్రెడీ టీమ్ మెంటార్ (Team Mentor) సచిన్ టెండుల్కర్ కూర్చొని ఉన్నాడు. అతడిని చూడగానే కిషన్ ఒక్కసారిగా భయపడిపోయాడు.

    క్లాసులో ప్రిన్స్‌పల్‌ను చూసి స్టుడెంట్స్ భయపడినట్లు ఇషాన్ కూడా భయపడ్డాడు. వెంటనే సన్‌క్లాసెస్, ఇయర్ బడ్స్ తీసేసి జేబులో పెట్టుకున్నాడు. ఇషాన్ అలా భయపడటం చూసి అక్కడ ఉన్న తోటి క్రికెటర్లు నవ్వుల్లో మునిగిపోయారు. సచిన్‌కి కొంత దూరంలో కూర్చున్న కిరాన్ పొలార్డ్ కూడా ఇషన్ కిషన్ భయానికి బిగ్గరగా నవ్వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కచ్చితంగా ఈ సంఘటన ఏ మ్యాచ్‌కు ముందు జరిగిందో వివరాలు తెలియదు కానీ.. ప్రస్తుతం కిషన్ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం వైరల్ అయ్యాయి.

    Messi Robed: మెస్సీ అటు మైదానంలో.. దొంగలు ఇటు అతడి హోటల్ గదిలో.. ప్యారీస్‌లో మెస్సీని దోచేశారు




    ఇక ఈ వీడియోపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. కిషన్‌కు ప్రిన్సిపల్‌ను చూసినంత భయమేసిందని ఒకరు అంటే.. తెలియకుండా సినిమాకు వెళ్లి వచ్చిన తర్వాత డాడీ లివింగ్‌రూమ్‌లో కనిపిస్తే ఇలాగే ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు. రాత్రంతా ఇంటికి రాకుండా ఉండే కొడుకు కోసం తల్లిదండ్రులు వెయిట్ చేసినట్లు ఉందని.. వాళ్లను చూసి కొడుకు గాభరా పడ్డట్టుగా కిషన్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.





    ఇక ఇషాన్ కిషన్ ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా బయోబబుల్‌లోకి వెళ్లనున్నాడు. భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడనున్నది. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో చాలా మంది ముంబై ఇండియన్ క్రికెటర్లు ఉన్నారు. రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, హార్దిక్ పాండ్యా టీ20 జట్టులోకి సెలెక్టర్లు ఎంపిక చేశారు. వీరిలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఫామ్ లేమితో ఉండటం టీమ్ ఇండియాను ఆందోళనకు గురి చేస్తున్నది. రిజర్వ్ ప్లేయర్లుగా ఉన్న శార్దుల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్‌లను మెయిన్ టీమ్‌కు ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: IPL 2021, Mumbai Indians, Sachin Tendulkar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు