IS VIRAT KOHLI STILL UPSET TEST CAPTAIN SKIPS PRACTICE SESSION NOT RESPONDING TO CALLS JNK
IND vs SA: ఇంకా కోపంగానే కోహ్లీ.. ముంబైలో అతడి కోసం ఎదురు చూస్తున్న టీమ్ ఇండియా.. బీసీసీఐ అధికారుల ఫోన్లకు నో రిప్లై
ఇంకా జట్టుతో చేరని విరాట్ కోహ్లీ.. ఆందోళనలో బీసీసీఐ అధికారులు
Virat Kohli: ముంబైలో టెస్టు జట్టు ఆదివారం చేరుకున్నది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా క్యాంపులో చేరలేదు. బీసీసీఐ అధికారులు, సెలెక్టర్లు కాల్ చేసినా అతడు కాల్ లిఫ్ట్ చేయడం లేదు. మరో మూడు రోజుల్లో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉండటంతో అందరూ ఆందోళన చెందుతున్నారు.
టీమ్ ఇండియా (Team India)వన్డే కెప్టెన్సీ (ODI captain) నుంచి తొలగించడంపై విరాట్ కోహ్ల (Virat Kohli) ఇంకా గుర్రుగానే ఉన్నాడా? తనకు జరిగిన అవమానానికి లోలోన కుమిలిపోతున్నాడా? జట్టుతో కలవడానికి కోహ్లీ సంశయిస్తున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. టీమ్ ఇండియా టెస్టు జట్టు మరో మూడు రోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు (South Africa Tour) వెళ్లాల్సి ఉన్నది. పర్యటనకు ఎంపికైన 18 మందితో పాటు హెడ్ కోచ్, సహాయక సిబ్బంది, నెట్ బౌలర్లు అందరూ ఆదివారం మధ్యాహ్నం లోగా ముంబైలో రిపోర్టు చేయాలని బీసీసీఐ (BCCI) ఆదేశించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు క్వారంటైన్లో తప్పకుండా గడపాలని.. ఆ తర్వాత అందరూ ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికాకు బయలుదేరాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే టీమ్ ఇండియా టెస్టు జట్టు మొత్తం ముంబై చేరుకున్నది. ఆదివారం సాయంత్రం ప్రాక్టీస్ కూడా చేశారు.
టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటి వరకు జట్టుతో చేరలేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన భారత ఆటగాళ్లు ముంబై చేరుకున్నారు. అందరూ కోహ్లీ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. కోహ్లీ శిబిరానికి చేరుకోకపోవడంతో సెలెక్టర్లు, కొంతమంది బీసీసీఐ అధికారులు అతడికి కాల్ చేయడానికి ప్రయత్నించారు. అయితే కోహ్లీ అసలు ఫోన్ ఎత్తలేదు. ఆదివారం రాత్రి వరకు కూడా అతడి నుంచి రిటర్న్ కాల్ రాలేదు. దీంతో అసలు కోహ్లీ వస్తాడా రాడా అని అందరూ ఆందోళన చెందుతున్నారు.
రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా ప్రకటించిన దగ్గర నుంచి కోహ్లీ ఎవరితోనూ మాట్లాడలేదు. కేవలం తన మ్యారేజ్ యానివర్సరీ రోజు మాత్రం సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. రోహిత్‌ను అభినందిస్తూ ఎలాంటి పోస్టు చేయలేదు. కానీ యువరాజ్ సింగ్ బర్త్ డే రోజు మాత్రం అతడిని అభినందిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశాడు. కోహ్లీ ఇంకా ఆగ్రహంతో ఉన్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టీమ్ ఇండియా టెస్టు జట్టు సభ్యులు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శార్దుల్ ఠాకూర్ సహా ఇతరులు అందరూ జట్టుతో కలిశారు. పరాస్ ముంబ్రే ఆదివారం సాయంత్రం కాసేపు బౌలింగ్ శిక్షణను కూడా పర్యవేక్షించాడు.
నెట్ బౌలర్లు: నవదీప్ సైని, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నాగ్వాస్వాలా
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.