హోమ్ /వార్తలు /క్రీడలు /

David Warner: ఈ రోజు డేవిడ్ వార్నర్ ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడనున్నాడా? తుది జట్టులో అతడికి స్థానం ఉంటుందా?

David Warner: ఈ రోజు డేవిడ్ వార్నర్ ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడనున్నాడా? తుది జట్టులో అతడికి స్థానం ఉంటుందా?

ఈ రోజు డేవిడ్ వార్నర్ వీడ్కోలు మ్యాచ్ ఆడనున్నాడా? (PC: IPL)

ఈ రోజు డేవిడ్ వార్నర్ వీడ్కోలు మ్యాచ్ ఆడనున్నాడా? (PC: IPL)

David Warner: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన బ్యాటర్‌గా గుర్తింపు పొందిన డేవిడ్ వార్నర్‌కు ఈ సీజన్ పెద్దగా కలసి రాలేదు. ఒకవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ పోగొట్టుకోవడంతో పాటు తుది జట్టులో కూడా స్థానం పొందలేక పోతున్నాడు. దీంతో అతడు ఈ సీజన్ తర్వాత హైదరాబాద్‌కు ఆడడు అనే సంకేతాలు వచ్చాయి. దీంతో ఇవాళ ముంబైతో జరిగే మ్యాచ్‌లో అతడికి స్థానం కల్పించి వీడ్కోలు ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది.

ఇంకా చదవండి ...

  ఐపీఎల్‌లో (IPL 2021) అత్యధిక పరుగులు చేసిన విదేశీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner). ఈ మెగా లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) చేరిన తర్వాత ఆ జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్ కూడా డేవిడ్ వార్నరే. గత కొన్ని సీజన్లుగా క్రమం తప్పకుండా ప్లే ఆఫ్స్‌కు (Play Offs) చేరుతున్న జట్టు కూడా సన్‌రైజర్స్. అయితే ఐపీఎల్ 2021లో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. తొలి దశలో కేవలం ఒకే మ్యాచ్ గెలిచిన హైదారబాద.. రెండో దశలో కూడా అలాగే ఆడింది. కాకపోతే రెండు మ్యాచ్‌లు గెలిచి ఫ్యాన్స్‌కు ఊరట కలిగించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ శుక్రవారం అబుదాబి వేదికగా చివరి మ్యాచ్ ఆడనున్నది. సన్‌రైజర్స్ కాస్తైనా పరువు నిలుపుకోవాలని బరిలోకి దిగుతుండగా.. అత్యంత భారీ మెజార్టీతో గెలిచి ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అనుకుంటున్నది. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఏదైనా మెగా అద్బుతమే జరగాల్సి ఉన్నది.

  సన్‌రైజర్స్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను 6 మ్యాచ్‌ల తర్వాత తప్పించారు. కెప్టెన్సీని తొలగించడమే కాకుండా తుది జట్టులో కూడా స్థానం ఇవ్వలేదు. కెప్టెన్సీని కేన్ విలియమ్‌సన్‌కు అప్పగించారు. రెండో దశలో కూడా సన్‌రైజర్స్ హైదారాబాద్ జట్టు తీరు మారలేదు. అవే ఓటములు కొనసాగాయి. వార్నర్‌కు ఓపెనర్‌గా ఛాన్స్ ఇచ్చినా నిరూపించుకోలేక పోయాడు. దీంతో ఆ తర్వాత జేసన్ రాయ్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. ఓపెనింగ్ బ్యాటర్‌గా అతడు తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. ఆ మ్యాచ్ కూడా హైదరాబాద్ గెలవడంతో అతడి స్థానం కన్ఫార్మ్ అయ్యింది. ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ రెండు మ్యాచ్‌లు ఓడింది. అయినా రాయ్ స్థానం కొనసాగింది.

  IPL 2021 : ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఒకే సమయంలో రెండు మ్యాచ్ లు..! ఎలా చూడాలంటే..  ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ జట్టులో పూర్తి ప్రక్షాళన జరుగనున్నది. డేవిడ్ వార్నర్ ఇకపై సన్‌రైజర్స్‌కు ఆడటం దాదాపు అనుమానమే. ఇప్పటికే వార్నర్ కూడా తాను జట్టును వదిలేస్తున్నట్లు సోషల్ మీడియాలో సంకేతాలు కూడా ఇచ్చాడు. దీంతో జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్‌గా వార్నర్‌కు వీడ్కోలు ఇవ్వాలని సన్‌రైజర్స్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇవాళ ముంబై ఇండియర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో వార్నర్‌కు చోటు కల్పించే అవకాశం ఉన్నది. వార్నర్‌కు వీడ్కోలు పలికే క్రమంలో ఓపెనర్లలో ఒకరిని డ్రాప్ చేసే అవకాశం ఉన్నది. విదేశీ ప్లేయర్ల కోటాలో జేసన్ రాయ్ లేదా జేసన్ హోల్డర్‌లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌ను తప్పించడం కుదరదు. అలాగే రషీద్ ఖాన్‌కు తుది జట్టులో స్థానం కల్పించక తప్పని పరిస్థితి. దీంతో ఎవరి స్థానంలో వార్నర్ ఆడతాడనే విషయం ఆసక్తిగా మారింది.

  Published by:John Kora
  First published:

  Tags: David Warner, IPL 2021, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు