Home /News /sports /

IS THIS CRICKET MATCH OR HOCKEY MATCH DASHING OPENER VIRENDRA SEHWAG SATIRE ON MI CSK MATCH JNK

IPL 2021: ఇది క్రికెట్ మ్యాచా లేదా హాకీ మ్యాచా.? ట్విట్టర్‌లో సెహ్వాగ్ సెటైర్.. ఎవరి మీద ఈ పంచ్ వేశాడంటే..

సెహ్వాగ్ సెటైర్‌కి పడీ పడీ నవ్వుతున్న నెటిజన్లు

సెహ్వాగ్ సెటైర్‌కి పడీ పడీ నవ్వుతున్న నెటిజన్లు

ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైంది. తొలి మ్యాచ్ ముంబై-చెన్నై మధ్య జరుగుతుండగా.. ముంబై బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో సెటైర్ వేశారు.

ఇంకా చదవండి ...
    టీమ్ ఇండియా (Team India) మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తన పంచులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాడు. క్రికెట్ (Cricket) కామెంటేటర్ కూడా అయిన సెహ్వాగ్ యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశ ను ఫాలో అవుతున్నాడు. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ అది ఎంత పెద్ద తప్పుడు నిర్ణయమో మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే తెలిసిపోయింది. తొలి ఓవర్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ (0), రెండో ఓవర్‌లో మొయిన్ అలీ (0), మూడో ఓవర్‌లో సురేష్ రైనా (4) పెవీలియన్ చేరాడు. రైనా కంటే ముందు అంబటి రాయుడు (0) రిటైర్డ్ హర్డ్ అయ్యి పెవీలియన్ చేరాడు. దీంతో మూడు ఓవర్లలో సీఎస్కే 7/3 స్కోర్ వద్ద నిలిచింది. ఈ స్కోర్ చూసిన వీరేంద్ర సెహ్వాగ్ సీఎస్కే మీద పంచ్ వేశాడు. అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా లేదా హాకీ మ్యాచ్ జరుగుతుందా అని ట్వీట్ చేశాడు.

    సెహ్వాగ్ చేసిన ట్వీట్ ఫాన్స్‌ను నవ్వుల్లో ముంచెత్తుతోంది. క్రికెట్ మ్యాచ్‌లో హాకీ ప్రాక్టీస్ చేస్తున్నారంటూ ఒక ఫ్యాన్ రిప్లై ఇవ్వగా.. మరి కొంత మంది ఫొటోలతో రిప్లైలు ఇస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సెహ్వాగ్ ట్వీట్‌ను రీట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు సీఎస్కే ఫ్యాన్స్ మాత్రం వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌పై మండిపడుతున్నారు. మూసుకొని చూడరా అంటు ఒకరు.. మూసుకొని తొంగోరా అంటూ మరొకరు ఘాటుగా రిప్లై ఇచ్చారు. అయితే సెహ్వాగ్ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే కెప్టెన్ ఎంఎస్ ధోనీ (7) కూడా అవుటై పెవీలియన్ చేరడంతో సీఎస్కే జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నాడు.





    ఇక మ్యాచ్‌కు ముందు పొలార్డ్ చేసిన కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. టాస్ ఓడిపోవడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఈ పిచ్ బౌలర్లకు సహకరిస్తుంది.. ఒక వేళ గెలిస్తే మేం బౌలింగ్ చేసే వాళ్లం అని అన్నాడు. ఇక మా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మనే.. కేవలం ఈ మ్యాచ్‌కు మాత్రమే తాను కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: IPL 2021, Virender Sehwag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు