ఇండియన్ క్రికెట్ టీమ్(Indian Cricket Team) లో ఉన్న ప్రముఖ బ్యాట్స్‌మెన్స్ లో ఒకరు 'శిఖర్ ధావన్'. శిఖర్ ధావన్(Shikhar Dhawan) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే క్రికెట్ అభిమానులందరికి కూడా ఈ పేరు సుపరిచయమే. టీమిండియా డాషింగ్ ఓపెనర్ గా.. అతడు ఏ ఫార్మట్ లో అయినా.. టీమ్ ఇండియాను(Team India) ఒంటి చేత్తో గెలిపించాడు. అతడిని చాలా మంది ‘గబ్బర్’ అని పిలుస్తుంటారు. అయితే ఇదిలా ఉండగా.. శిఖర్ ధావన్, పెళ్లై విడాకులు తీసుకుని.. ఇద్దరు పిల్లలున్న అయేషాను ప్రేమించి పెళ్లాడాడు. శిఖర్ ధావన్ బ్యాటింగ్ స్టైల్ లాగే.. అతని పర్సనల్ లైఫ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. శిఖర్ ధావన్ భార్య అయేషా ముఖర్జీకి అప్పటికే పెళ్లై.. విడాకులు కూడా తీసుకుంది. విడాకులు తీసుకుని 10 ఏళ్లు ఒంటరిగా జీవించిన తర్వాత అయేషా జీవితంలోకి వచ్చాడు శిఖర్ ధావన్.
View this post on Instagram
ఆంగ్లో ఇండియన్ అయిన అయేషా తండ్రి బెంగాళీ. ఆమె తల్లి బ్రిటన్ దేశస్థురాలు... అయేషా కుటుంబం మొత్తం ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యింది. అయేషా కూడా అక్కడే పుట్టి పెరిగింది. అయితే మొదట.. అయేషా ఓ ఆస్ట్రేలియా బిజినెస్‌మ్యాన్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా పుట్టారు. అయితే ఆ తర్వాత మనస్పర్థల కారణంగా అతనికి విడాకులు తీసుకుని వేరుపడింది అయేషా. అయేషా, భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కి ఫేస్‌బుక్ ఫ్రెండ్. శిఖర్ ధావన్, భజ్జీ ఫేస్‌బుక్‌లో అయేషా ఫోటో చూసి... తొలి చూపులోనే ఆయేషా ప్రేమలో పడ్డారు శిఖర్ ధావన్. అయితే వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన ధావన్ భజ్జీ స్నేహితుడు కావడంతో శిఖర్ ధావన్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను వెంటనే యాక్సెప్ట్ చేసింది అయేషా.
View this post on Instagram
అలా ఫేస్‌బుక్ ఛాటింగ్ ద్వారా ఈ ఇద్దరి మధ్య పరిచయం కొన్నాళ్లకు స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. అయేషా ముఖర్జీ(Aesha Mukharji) వివాహం, విడాకులు, పిల్లల గురించి పూర్తిగా తెలుసుకున్న శిఖర్ ధావన్, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ పెళ్లికి శిఖర్ ధావన్ కుటుంబీకులు అంగీకరించలేదు. మరో విషయం ఏంటంటే.. శిఖర్ ధావన్ కంటే అయేషా 10 ఏళ్లు పెద్దవారు. ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోయినా.. తన తల్లి ఒప్పుకోవడంతో 2009 లో ఇంటి నుంచి బయటకు వచ్చి.. 2012 సంవత్సరంలో అతడు అయేషాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలోనే అయోషాకు.. తన కూతుళ్లను(ఆలియా, రియాల) మంచిగా చూసుకోవాలని మాట ఇచ్చాడట.
Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రాపై వైరల్ అవుతున్న న్యూస్.. అదేంటంటే..
దీంతో అతడు పెళ్లి చసుకున్న రెండు సంవత్సరాల తర్వాత వాళ్లిద్దరికి ఒక కొడుకు పుట్టాడు. ఇది అతడి లవ్ స్టోరీ.. ఇదిలా ఉండగా.. అంతలా తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధావన్, ఆయేషా విడాకులు తీసుకుంటున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శిఖర్ ధావన్ భార్య అయేషా ముఖర్జీ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది. నిజానికి ఈ పోస్టు సోమవారమే పెట్టింది.
కానీ, ఇది ఇప్పుడు అభిమానుల కంటపడి వైరల్ అయ్యింది. 'రెండోసారి విడాకులు తీసుకునేంతవరకు విడాకులంటే అదేదో చెడ్డ పదంలా భావించేదాన్ని. ఫన్నీ.. విడాకులు,వివాహం వంటి పదాలకు ఎంత శక్తివంతమైన అర్థాలు,అనుబంధాలు ఉంటాయో.మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు చాలా భయపడ్డాను.జీవితంలో నేనేదో విఫలమైనట్లు..చేయకూడని తప్పు చేసినట్లు బాధపడ్డాను. నా స్వార్థం కోసం తల్లిదండ్రులు, పిల్లలను ఇబ్బంది పెడుతున్నానని అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాను. ఇది ఊహించుకుంటే భయానకంగా ఉంది. ఇప్పుడు మళ్లీ నన్ను నేను నిరూపించుకోవాలి.' అని అయేషా ముఖర్జీ ఇన్‌స్టాలో పేర్కొన్నారు.
ప్రస్తుతం శిఖర్ ధావన్ ఐపీఎల్ - 2021 కోసం యూఏఈ వెళ్లాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కి ధావన్ ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. నిజంగానే గబ్బర్ దంపతులు విడాకులు తీసుకున్నారా? లేక ఏదైనా ప్రమోషన్ కోసం ఇలా అయేషా ఇన్ స్టాలో పోస్టు పెట్టిందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. అభిమానులకు మాత్రం షాక్ ను గురిచేసింది. ఇదిలా ఉండగా.. ఈ పోస్టుపై శిఖర్ ధావన్ ఇంత వరకు స్పందించలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Shikhar Dhawan, Team India, Trending news