IS IT GOOD FOR CRICKET TO CHOOSE IPL OVER NATION DUTY AND SOUTH AFRICA CRICKETERS OPTS T20 LEAGUE OVER BANGLADESH CRICKETERS SRD
IPL 2022 : దేశం కన్నా ఐపీఎల్ గొప్పదా.. క్రికెటర్లు ఎందుకు ఇలా చేస్తున్నారు..?
ఐపీఎల్ 2022
IPL 2022 : ఒక దేశ క్రికెట్ బోర్డు కన్నా క్లబ్ క్రికెట్టే గొప్పదా? జాతీయ జట్టు బాధ్యతలు కన్నా.. డబ్బు ముఖ్యమైందా..? అంటే అవుననే సమాధానాలు విన్పిస్తున్నాయ్. అందుకు సాక్ష్యాలు కూడా కన్పిస్తున్నాయ్.
అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ఊహించినట్లే ఐపీఎల్ (IPL 2022)లో ఆడే దక్షిణాఫ్రికా ఆటగాళ్ల (South Africa)కు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ (SA vs BAN Test Series) నుంచి మినహాయింపు లభించింది. సొంతగడ్డపై జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శుక్రవారం 15 మంది సభ్యుల జట్టును క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA)ప్రకటించింది. రబాడ, ఎంగిడి, మార్కో జాన్సెన్, మార్క్రమ్, డసెన్‌ల సేవల్ని దక్షిణాఫ్రికా కోల్పోనుంది. ఐపీఎల్లో ఆడాలా? టెస్టు సిరీస్‌లో బరిలో దిగాలా? అన్నది ఆటగాళ్లకే వదిలేస్తున్నట్లు సీఎస్ఏ స్పష్టంచేసింది. ఆటగాళ్లు లీగ్ వైపే మొగ్గుచూపారు. సీఎస్ఏతో దక్షిణాఫ్రికా క్రికెటర్ల సంఘం (ఎస్ఏఎస్ఏ) ఒప్పందం ప్రకారం ఐపీఎల్లో పాల్గొనకుండా బోర్డు అడ్డుకోకూడదు. ఆటగాళ్ల జీవనోపాధి, అవకాశాలు.. జాతీయ జట్టుకు వారి సేవల్ని రెండు సంస్థలు సమన్వయం చేసేందుకు ప్రయత్నించాలి. ఈనెల 31న డర్బన్‌లో తొలి టెస్టు, ఏప్రిల్ 7న పోర్ట్ ఎలిజబెత్‌లో రెండో టెస్టు ప్రారంభమవుతాయి.
అయితే, కాసులు కురిపిస్తున్న క్యాష్ రిచ్ లీగ్ కోసం తమ జాతీయ జట్టు బాధ్యతలను కూడా వదులుకోవడం అన్యాయమే. తమకు జాతీయ జట్టు కంటే ఐపీఎలే ముఖ్యమని, చిన్నజట్టుతో కూడా తామే ఆడాలా..? అని న్యూఢిల్లీ విమానాలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.త్వరలో బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగే రెండు టెస్టుల సిరీస్ ను వద్దనుకుని మరి ఐపీఎల్ లో తమను కోట్లు పోసి దక్కించుకున్న జట్లతో చేరేందుకు రెడీ అవుతున్నారు.
దక్షిణాఫ్రికా జట్టు (ఫైల్ ఫోటో)
సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇలా చేయడం ద్వారా ఒక దేశ క్రికెట్ బోర్డు కన్నా క్లబ్ క్రికెట్టే గొప్పదా? అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. ఇదివరకే ఆ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్.. బంగ్లాదేశ్ పర్యటన అనేది సౌతాఫ్రికా ఆటగాళ్ల నిబద్ధతకు పరీక్ష లాంటిదని వ్యాఖ్యానించాడు. అయినా, వారు ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపారు.
సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడేందుకు అనుమతిస్తే.. వారికి వచ్చే ఆదాయంలో 10 శాతం ఆ బోర్డుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో క్లబ్ క్రికెట్ గొప్పదా? దేశ క్రికెట్ బోర్డు గొప్పదా? అంటే.. ఈ వివాదం ఎప్పటికీ తేలదు.
ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా ఆటగాళ్లు ఇతర లీగులు ఆడాలా వద్దా అనే దాన్ని ఏ బోర్డూ ఆపలేదని నమ్మాల్సిన నిజం. ఇటీవల జరిగిన పలు అంతర్జాతీయ సిరీసుల్లో బీసీసీఐ కూడా పలువురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. కానీ, వారికి ఐపీఎల్లో పూర్తి సీజన్ ఆడేందుకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఒక దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మాత్రమే కాదు చాలా దేశాల ఆటగాళ్లు ఇలానే చేస్తున్నారు. వార్నర్ కూడా పాక్ తో జరిగే లిమిటెట్ ఓవర్ల క్రికెట్ కు డుమ్మా కొట్టాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.