'మ్యాచ్ ఎలా సాగిందనేది ముఖ్యం కాదు. ఐపీఎల్ అంటే ఫలితాలు. ఐపీఎల్ అంటే విజయాలు' అని పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కెప్టెన్ కేఎల్ రాహుల్ రాజస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం వ్యాఖ్యానించాడు. నిజమే ఐపీఎల్ అనే కాదు ఏ ఆటలో అయినా విజయమే అంతిమ లక్ష్యం. మనకు ఎంత టాలెంట్ ఉన్నా.. ప్రత్యర్థి బలహీనతలు కూడా తెలుసుకుంటేనే వారిపై ఆధిపత్యం ఎలా చెలాయించాలో తెలిసి వస్తుంది. మన బలంతో పాటు వారి బలహీనతలు వాడుకుంటేనే అంతిమంగా విజయం లభిస్తుంది. ఇప్పుడు ఇదే సూత్రాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ అనుసరిస్తున్నది. మంగళవారం రాత్రి చెన్నై వేదికగా కోల్‌కతా జట్టు (Kolkata Knight Riders) ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) తలపడనున్నది. ఓటమితో సీజన్ ప్రారంభించిన ముంబైని ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. అందుకే కోల్‌కతా జట్టు అన్ని అస్త్రశస్త్రాలను సమకూర్చుకుంటుంది. ముఖ్యంగా ముంబై జట్టు బలహీనతలను వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను (Harbhajan Singh) అడిగి తెలుసుకుంటున్నది. తాజాగా జరిగిన ప్రెస్ కాన్ఫరెర్స్లో కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్తో పాటు హర్భజన్ పాల్గొన్నాడు. తనను తాను కేకేఆర్‌కు అవసరమైన సహాయం చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
హర్భజన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. గతంలో ముంబై ఇండియన్స్ తరపున హర్బజన్ సింగ్ ఆడాడు. ఆ జట్టులోని బలాలు, బలహీనతలు ఏమిటో హర్భజన్‌కు పూర్తిగా తెలుసు. బ్యాట్స్‌మెన్ ఎలా ఆడతారు? వారి వీక్నెస్ ఏమిటి? ఎలాంటి షాట్లు ఆడలేరు అనే విషయాలు మొత్తం భజ్జీకి అవగతమే. దీంతో ప్రస్తుతం కేకేఆర్ జట్టుతో ఉన్న భజ్జీ ఈ విషయాలన్నీ గూఢచారిలా చేరవేస్తున్నాడా అనే అనుమానాలు నెలకొన్నాయి. ముంబై జట్టులో ఏ సీజన్లో చూసినా ఎక్కువ మ్యాచ్‌లు గెలిచినట్లే కనపడుతున్నది. కానీ చాలా మ్యాచ్‌లు అతి తక్కువ పరుగుల తేడాతో లేదా చాలా క్లిష్టంగా గెలిచింది. రెండు ఫైనల్స్‌లో అయితే ఓకే పరుగు తేడాతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ సీజన్ల ప్రారంభంలో ఆ జట్టు ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ జట్టు కెప్టెన్ రోహిత్ వర్మ వ్యూహాల కారణంగా ముంబై ప్రతీసారి ప్లేఆఫ్స్ చేరడం.. చాంపియన్‌గా నిలవడం జరుగుతున్నది. దీంతో ముంబై జట్టు బలహీనతలు తెలుసుకోవాలని ప్రతీ జట్టు తపిస్తుంటుంది.
హర్భజన్ కేవలం ముంబై తరపునే కాకుండా.. చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా ఆడాడు. మరోవైపు చెన్నైలోని చేపాక్ పిచ్‌పై ఎక్కువగా ఆడిన అనుభవం భజ్జీకి ఉన్నది. ముంబైతో జరిగే మ్యాచ్ చేపాక్ స్టేడియంలోనే జరుగనుండటంతో భజ్జీ ఇచ్చే సూచనలు కేకేఆర్ జట్టుకు తప్పకుండా పనికి వస్తాయి. ఈ కారణంగానే ప్రస్తుతం అనధికార కోచ్‌గా భజ్జీ జట్టులోని ఇతర సభ్యులకు పాఠాలు చెబుతున్నట్లు తెలుస్తున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Harbhajan singh, IPL 2021, Kolkata Knight Riders