హోమ్ /వార్తలు /క్రీడలు /

MS Dhoni - Sakshi : ధోనీ మరోసారి తండ్రి కాబోతున్నాడా..? వైరలవుతున్న సాక్షి ఫోటో..!

MS Dhoni - Sakshi : ధోనీ మరోసారి తండ్రి కాబోతున్నాడా..? వైరలవుతున్న సాక్షి ఫోటో..!

Photo Credit : Instagram

Photo Credit : Instagram

MS Dhoni - Sakshi : గతేడాది ఇదే చోట జరిగిన టోర్నీలో ఘోరంగా విఫలమైన ధోనీసేన .. సరిగ్గా ఏడాదిలో కప్పు కొట్టి విమర్శకుల నోళ్లు మూయించింది. యెల్లో ఆర్మీ కప్ కొట్టడంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇంకా చదవండి ...

చెన్నై సింహాలు (Chennai Super Kings) మళ్లీ గర్జించాయి. ఐపీఎల్ 2021 ఫైనల్‌ (IPL 2021 Final) లో కోల్‌కతాను ఓడించి టైటిల్‌ను ఎగరేసుకుపోయాయి. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది నాలుగో టైటిల్. సీఎస్కే టీమ్ గెలవడంతో ధోనీ ఫ్యాన్స్‌తో పాటు చెన్నై జట్టు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దుబాయ్ వేదిక‌గా శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ (KKR)ను 27 ప‌రుగుల తేడాతో ఓడించి.. నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. గతేడాది ఇదే చోట జరిగిన టోర్నీలో ఘోరంగా విఫలమైన ధోనీసేన .. సరిగ్గా ఏడాదిలో కప్పు కొట్టి విమర్శకుల నోళ్లు మూయించింది. యెల్లో ఆర్మీ కప్ కొట్టడంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారి సంబరాలకు అంతేలేకుండా పోయింది. ముఖ్యంగా తమిళనాడు సంబరాలు అంబరాన్నంటాయ్.

ఇక, చెన్నై సూప‌ర్‌ కింగ్స్ ట్రోఫీ గెలవడంతో పండగ చేసుకుంటున్న ఎంఎస్ ధోనీ (Mahendra Singh Dhoni) అభిమానులకు మరో శుభవార్త అనే చెప్పాలి. తలా ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అనే చెప్పాలి. సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి త్రండ్రి కాబోతున్నాడని తెలుస్తోంది. ధోనీ సతీమణి సాక్షి సింగ్ (Sakshi Singh) ప్రస్తుతం గర్భవతి అని సమాచారం.

యూఏఈలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులు చూసేందుకు సాక్షి మైదానంకు వచ్చారు. ఆ సమయంలో ఆమె బేబీ బంప్‌తో కనిపించారు. చెన్నై ట్రోఫీ గెలిచిన అనంతరం మైదానంలో వచ్చిన సమయంలో కూడా సాక్షి బేబీ బంప్‌ స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాక్షి గర్భవతి అని ఫాన్స్ ట్వీట్స్ చేస్తూ.. కంగ్రాట్స్ చెబుతున్నారు.

సాక్షి సింగ్.. ఐపీఎల్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. తన భర్త టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు మద్దతు ఇస్తుంటారు. ప్రేక్షకుల మధ్య గ్యాలరీలో తెగ సందడి చేస్తుంటారు. దీంతో టీవీ కెమెరాలు పదేపదే సాక్షిని చూపించేవి. మహీ టీమిండియాకు ఆడిన సమయంలోనూ ఆమె మైదనంలో సందడి చేసేవారు. సాక్షి సింగ్, ఎంఎస్ ధోనీ దంపతులకు జీవా అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే.

ఇక, IPL 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పర్ఫామెన్స్ చూసిన తర్వాత ఆ జట్టు టైటిల్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. సీఎస్‌కే కనీసం ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించడం కూడా కష్టమేనంటూ క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ కామెంట్ చేశారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఐపీఎల్ 2021 సీజన్‌లో మాస్ కమ్‌బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. ఏకంగా ఫైనల్స్ కు చేరి అదిరిపోయే ప్రదర్శన చేసి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది నాలుగో టైటిల్ . ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఐపీఎల్ కప్ ను ముద్దాడగా.. చెన్నై నాలుగు టైటిళ్లతో రెండో స్దానంలో ఉంది.

First published:

Tags: Chennai Super Kings, IPL 2021, MS Dhoni, Sakshi dhoni

ఉత్తమ కథలు