ఐపీఎల్ 2021 సీజన్ (IPL 2021 Season Latest News)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ (CSK Vs PBKS) మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చోసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత తన లవ్‌స్టోరీ ని తెరమీదికి తీసుకొచ్చాడు దీపక్ చాహర్ (Deepak Chahar Love Story). చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యామిలీ గ్యాలరీకి వెళ్లిన ఆ జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ తన ప్రేయసీ జయ భరద్వాజ్ కి ప్రపోజ్ చేశాడు. మోకాలిపై కూర్చొని 'నేను నిన్న ప్రేమిస్తున్నాను.. నన్ను పెళ్లి చేసుకుంటావా?'అని అడిగాడు. దీపక్ చాహర్ చేసిన పనితో ఒకింత ఆశ్చర్యానికి గురైన ఆ అమ్మాయి.. వాట్? అంటూ అతని ప్రేమను అంగీకరిస్తూ గట్టిగా హత్తుకుంది. అనంతరం అతని చేత తన వేలికి ఉంగరాన్ని పెట్టించుకుంది. చాహర్‌కు కూడా రింగ్ పెట్టింది. ఇదంతా ఓ సినిమా సన్నివేశాన్ని తలపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై ఫ్యామీలీ గ్యాలరీకి వచ్చిన దీపక్ చాహర్.. ఏం తెలియనట్టూ కొద్దిసేపు నిలబడ్డాడు. ఆ తర్వాత ధోనీ కూతురు జీవాను పక్కకు జరుపుతూ తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు.
దీంతో పక్కనున్న వారంత అవాక్కయ్యారు. హోహో అంటూ చప్పట్లతో అభినందించారు. సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ జోడీని ఆశీర్వదించారు. ఇక కామెంటేటర్లు సైతం ఈ జోడి బాగుండాలని దీవించారు. దీపక్ చాహర్‌కు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. చెన్నై అభిమానులు చాహర్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
View this post on Instagram
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే దీపక్ చాహర్-జయ భరద్వాజ్ ఒక్కటవుతారని తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్.. స్టాండ్ బై ప్లేయర్‌గా సెలెక్ట్ అయ్యాడు. అయితే, ఈ క్యూట్ లవ్ స్టోరీ వెనుక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రమేయం ఉందని తెలుస్తోంది. నిజానికి- దీపక్ చాహర్.. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచులు ముగిసిన తరువాత ఈ ప్రపోజ్ చేయాలని భావించాడు. ఈ విషయాన్ని అతను మొట్టమొదటి సారిగా ఎంఎస్ ధోనీకి తెలియజేశాడు. ప్లేఆఫ్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి మ్యాచ్ ముగిసిన తరువాత ఈ ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నట్లు దీపక్ చాహర్.. ధోనికి చెప్పాడు.
దీనికి ధోని స్పందిస్తూ అలా చేయవద్దని... ప్లే ఆఫ్స్ ముగిసేంత వరకూ జాప్యం చేయొద్దని సూచించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రపోజ్ చేయాలని దీపక్ చాహర్‌కు సలహా ఇచ్చాడని తెలుస్తోంది. ధోని సలహాను మరో మాట లేకుండా దీపక్ అంగీకరించాడని, మ్యాచ్ ముగిసిన వెంటనే జయ భరద్వాజ్‌కు ప్రపోజ్ చేశాడని చెబుతున్నారు. ధోనీది కూడా లవ్ మ్యారేజే. తన భార్య సాక్షిని అతను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. సాక్షి.. ధోనికి చిన్నప్పటి స్నేహితురాలు.
జయ భరద్వాజ్.. బిగ్‌బాస్ 5 హిందీ కంటెస్టెంట్. స్ప్లిట్స్ విల్లా రియాలిటీ షోలోనూ ఆమె కంటెస్ట్ చేశారు. సిద్ధార్థ్ భరద్వాజ్ చెల్లెలు ఆమె. స్వస్థలం ఢిల్లీ. ఓ కార్పొరేట్ కంపెనీని నడిపిస్తోన్నట్లు తెలుస్తోంది. దీపక్ చాహర్-జయ భరద్వాజ్ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. మొత్తానికి ఈ క్యూట్ లవ్ స్టోరీ ఈ ఐపీఎల్ సీజన్ కే హైలెట్ గా నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Cricket, IPL 2021, MS Dhoni