Anil Kumble: టీమ్​ ఇండియా కోచ్​ పగ్గాలు మళ్లీ అనిల్​ కుంబ్లేకే దక్కనున్నాయా?.. బీసీసీఐ మదిలో ఏముంది?​

అనిల్ కుంబ్లే(ఫైల్ ఫొటో) (Getty Images)

టీ20 వరల్డ్ కప్ 2021 (T20 World Cup 2021)ముగిసిన తరువాత టీమ్ ఇండియాలో చాలా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. పనిభారం నుంచి ఉపశమనం పొందేందుకు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Share this:
టీ20 వరల్డ్ కప్ 2021 (T20 World Cup 2021)ముగిసిన తరువాత టీమ్ ఇండియాలో చాలా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. పనిభారం నుంచి ఉపశమనం పొందేందుకు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీ20 ప్రపంచకప్‌ తర్వాత హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి(Ravi Shastri) కూడా టీమిండియా నుంచి తప్పుకొనున్నారు. కోచ్​గాఆయన కాలపరిమితి ముగుస్తుండటంతో ఈ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలను మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లేకు(Anil Kumble) అప్పగించేందుకు బీసీసీఐ(Board of Control for Cricket in India) ప్లాన్​చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కుంబ్లే 2016-17 కాలంలో టీమిండియా కోచ్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో టీమిండియా (Team India) కెప్టెన్సీ బాధ్యతలను కోహ్లీ భుజానికెత్తుకున్నారు. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత జట్టు పరాజయం పాలైంది. ఆ సమయంలో కోహ్లీ, కుంబ్లేల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో కుంబ్లే తన ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశారు.

అయితే అప్పట్లో జట్టుకు కోచ్‌గా కొనసాగాలని బీసీసీఐ కుంబ్లేని కోరింది. కానీ కోహ్లీతో(Virat Kohli) విబేధాల కారణంగాకుంబ్లే కోచ్‌గా కొనసాగలేక పోయారు. అయితే, ఇప్పుడురవిశాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో పాటు కోహ్లీ టీ20 కెప్టెన్‌గా వైదొలగడంతో మాజీ స్పిన్నర్ కుంబ్లేకి లైన్​ క్లియర్​ అయ్యింది. ఆయన్ను హెడ్ కోచ్‌గా తిరిగి తీసుకురావడానికి బీసీసీఐ(BCCI) ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా కుంబ్లే జట్టుకు కోచ్‌గా కొనసాగాలని గంగూలీ(Ganguly) కోరినట్టుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ పేర్కొంది. ఇప్పుడు కూడా కోహ్లీకి నచ్చకపోయినా.. కుంబ్లేకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత గౌరవ మర్యాదలు సంపాదించిన వారిలో కుంబ్లే ఒకరు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

T-20 World Cup : టీ -20 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్, టైమింగ్స్, గ్రూప్ ల వివరాలన్నీ మీ కోసం...

టీ20 కెప్టెన్సీకికొహ్లీ గుడ్​బై చెప్పడంతో లైన్​ క్లియర్​..
అయితే రవిశాస్త్రి పదవిని భర్తీ చేయడానికి కుంబ్లేతో పాటు ముంబై ఇండియన్స్(Mumbai Indians) కోచ్ మహేలా జయవర్ధనేని కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నట్టు సమాచారం. కానీ జయవర్ధనే టీమిండియా ప్రధాన కోచ్‌ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తిగా లేరనితెలుస్తోంది. ఐపీఎల్ జట్టుతో పాటు శ్రీలంక జాతీయ జట్టుకు మాత్రమే కోచ్‌గా పరిమితం కావాలని జయవర్ధనే భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ టీమిండియా పదవిలో చేరాలనుకుంటే.. అతను ముంబై ఇండియన్స్ కోచ్ బాధ్యతలను వదులుకోవాల్సి ఉంటుంది.

Ravi Shastri: త్వరలో కోహ్లీ సేనకు కొత్త కోచ్.. గుడ్ బై చెప్పనున్న రవిశాస్త్రి.. రేసులో ఉన్నది వీళ్లే...

ఎందుకంటే ఒకే వ్యక్తి రెండు పదవుల్లో ఉండటాన్ని బీసీసీఐఅనుమతించదు. అలాగే కుంబ్లే కూడా పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా తన బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన పదవికి కూడా రాజీనామా చేయాలి. కోహ్లీ వన్డేలు, టెస్టుల మ్యాచ్ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకోలేదు. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే మళ్లీ హెడ్‌కోచ్‌ గా బాధ్యతలు తీసుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Published by:Sumanth Kanukula
First published: