Ireland vs Netherlands: ఐర్లాండ్‌ అలవోకగా... నెదర్లాండ్స్‌ ఢిలా..!

Ireland vs Netherlands

Ireland vs Netherlands: టీ20 ప్రపంచకప్‌-2021 క్వాలిఫయర్స్‌ రౌండ్‌లో గ్రూపు-ఏలో ఉన్న ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ అలవోకగా విజయం సాధించింది

  • Share this:
    Ireland vs Netherlands: టీ20 ప్రపంచకప్‌-2021 క్వాలిఫయర్స్‌ రౌండ్‌లో గ్రూపు-ఏలో ఉన్న ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ అలవోకగా విజయం సాధించింది. అబుదాబి షేక్‌ జాయేద్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో
    ఐర్లాండ్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలిత టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్స్‌ . నిర్ణీత 20 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ మాక్స్‌ 51(47 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ శతకం సాధించగా.. కెప్టెన్‌ పీటర్‌ సీలార్‌(21) స్కోరు చేశాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ ఈజీగా టార్గెట్‌ను ఛేధించింది.

    తుది జట్లు:
    ఐర్లాండ్‌: ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్‌), పాల్‌ స్టిర్లింగ్, కెవిన్‌ ఒబ్రెయిన్‌, గరేత్‌​ డిలనీ, హారీ టెక్టార్‌, కర్టిస్‌ కాంపర్‌, నీల్‌ రాక్(వికెట్‌ కీపర్‌)‌, సిమీ సింగ్‌, మార్క్‌ అదేర్‌, బెంజమిన్‌ వైట్‌, జోషువా లిటిల్‌.

    నెదర్లాండ్స్‌:
    పీటర్‌ సీలార్‌(కెప్టెన్‌), మాక్స్‌ ఆడౌడ్‌, బెన్‌ కూపర్‌, బాస్‌ డీ లీడే, కొలిన్‌ ఆకెన్‌మాన్‌, రియాన్‌ టెన్‌ డొచేట్‌, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌(వికెట్‌ కీపర్‌), రోలోఫ్‌ వాన్‌ దెర్‌ మెర్వీ, లాగన్‌ వాన్‌ బీక్‌, ఫ్రెడ్‌ క్లసేన్‌​, బ్రెండన్‌ గ్లోవర్‌.
    Published by:Rekulapally Saichand
    First published: