Home /News /sports /

IRELAND ALL ROUNDER KEVIN O BRIEN ANNOUNCES RETIREMENT FROM INTERNATIONAL CRICKET SJN

kevin o'brien : క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఐర్లాండ్ యోధుడు.. ఇతడి పేరు చెబితో పాక్, ఇంగ్లండ్ వణికిపోవాల్సిందే

PC : TWITTER

PC : TWITTER

kevin o'brien : ఐర్లాండ్ (Ireland) క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనుడు.. పసికూనను చిచ్చర పిడుగులా మార్చిన ఆల్ రౌండర్.. ప్రపంచకప్ (World Cup) లలో ఫేవరెట్ జట్లను సైతం తాము  ఓడించగలం అని ప్రపంచానికి చాటి చెప్పిన క్రికెటర్.. అతడే కెవిన్ ఒబ్రెయిన్ (kevin o'brien).

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
kevin o'brien : ఐర్లాండ్ (Ireland) క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనుడు.. పసికూనను చిచ్చర పిడుగులా మార్చిన ఆల్ రౌండర్.. ప్రపంచకప్ (World Cup) లలో ఫేవరెట్ జట్లను సైతం తాము  ఓడించగలం అని ప్రపంచానికి చాటి చెప్పిన క్రికెటర్.. అతడే కెవిన్ ఒబ్రెయిన్ (kevin o'brien). ఐర్లాండ్ క్రికెట్ గతినే మార్చిన కెవిన్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ అనంతరం కెరీర్ కు గుడ్ బై చెప్పాలని తొలుత భావించినా..  కొన్ని రోజులుగా తనను సెలక్టర్లు పక్కనపెట్టారన్న 38 ఏళ్ల కెవిన్‌.. అందుకే రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా మంగళవారం సుదీర్ఘ నోట్‌ షేర్‌ చేశాడు.

‘ఐర్లాండ్‌ తరఫున ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఈ ప్రయాణంలో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నాను. నాతో పనిచేసిన కోచ్‌లు.. సిబ్బందికి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవకాశం కల్పించిన అడీ బిరెల్‌, ఫిల్‌ సిమ్మన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. క్రికెటర్‌గా నా ప్రయాణంలో వెన్నంటి నిలిచిన నా కుటుంబ సభ్యులకు థాంక్యూ. నేను ఆటలో బిజీగా ఉన్న సమయంలో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్న నా భార్య రూత్‌ అనీకి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ కెవిన్‌ తన నోట్‌లో పేర్కొన్నాడు.






ఒబ్రెయిన్ చేతిలో చావు దెబ్బ తిన్న పాక్, ఇంగ్లండ్

కెవిన్ ఒబ్రెయిన్ 2006లో ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. సోదరుడు నీల్ ఒబ్రెయిన్ తో కలిసి జట్టుకు ఆడాడు. 2007 వన్డే ప్రపంచకప్ లో ఐర్లాండ్ పేరు మార్మోగిపోయింది. మార్చి 17న పాకిస్తాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఐర్లాండ్ పెను సంచలనాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్ లో ఐర్లాండ్.. పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత పాక్ 132 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం ఐర్లాండ్ ఆ లక్ష్యాన్ని 7 వికెట్లు నష్టపోయి ఛేదించింది. అన్న నీల్ ఒబ్రెయిన్ 72 పరుగులతో చెలరేగితే.. కెవిన్ 52 బంతుల్లో 16 పరుగులు చేసి అజేయంగా జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ లో ఒక వికెట్ కూడా తీశాడు. ఐర్లాండ్ చేతిలో ఓడటంతో పాక్ మరో  మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి తప్పుకుంది.



ఇక భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ లోనూ కెవిన్ చెలరేగిపోయాడు. ఈసారి ఇంగ్లండ్ కు బెంగళూరులో చుక్కలు చూపించాడు. మార్చి 2న జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 327 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 329 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కెవిన్ 63 బంతుల్లోనే 113 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్ గా కెవిన్ ఉన్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో అతడు 50 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. అంతర్జాతీయ కెరీర్ లో కెవిన్ 3 టెస్టులు.. 152 వన్డేలు, 109 టి20లు ఆడాడు. మొత్తం కలిపి 5,850 పరుగులు చేశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cricket, Cricket world cup 2011, England, ICC, Pakistan, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు