Home /News /sports /

IPL TWO NEW TEAMS TO BE AUCTIONED IN MAY HERE IS FULL DETAILS SK

IPL: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇక 10 టీమ్స్.. కొత్త జట్లు వచ్చేది ఎప్పుడంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈసారే పది జట్లు వస్తాయని మొదట ప్రచారం జరిగింది. కానీ అది కుదరలేదు. మెగా ఐపీఎల్‌ వేలం నిర్వహించడానికి సమయం తక్కువగా ఉండడంతో 10 జట్ల నిర్ణయాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.

    2008లో ఐపీఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. త్వరలోనే 14వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఐతే ఇప్పటి వరకు 8 జట్లు మాత్రమే ఉన్నాయి. మధ్యలో కొచ్చి టస్కర్స్ కేరళ, పుణె వారియర్స్ ఇండియా, గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ జట్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. 2011లో కొచ్చి టస్కర్స్ కేరళ, పుణె వారియర్స్ ఇండియాతో కలిపి మొత్తం 10 జట్లు తలపడ్డాయి. 2012లో తొమ్మిది జట్లు పోటీపడ్డాయి. ఇక 2013 నుంచి టోర్నీలో 8 జట్లే బరిలోకి దిగుతూ వచ్చాయి. ఐతే త్వరలో ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు రాబోతున్నాయి. పొట్టి క్రికెట్‌లో పది జట్లు ఉండబోతున్నాయి.

    ఐపీఎల్‌లో 2022 నుంచి పది జట్లు ఆడనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ నుంచి స్పష్టత వచ్చింది. రెండు కొత్త జట్ల కోసం వచ్చే మే నెలలో వేలం నిర్వహించనుంది బీసీసీఐ. శనివారం జరిగిన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బిడ్డింగ్‌ ప్రక్రియ తర్వాత కొత్త ఫ్రాంచైజీలు మే చివరి వరకు ఖరారైతే, ఆయా జట్లు తమ సన్నాహాలు చేసుకునేందుకు ఏడాది పాటు సమయం ఉంటుందని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. అనంతరం 2022లో పది జట్లు ఆడేందుకు మార్గం సుగమం అవుతుందని వెల్లడించారు.

    ఈ సీజన్‌లో 8 జట్లే బరిలోకి దిగనున్నాయి. ఈసారే పది జట్లు వస్తాయని మొదట ప్రచారం జరిగింది. కానీ అది కుదరలేదు. మెగా ఐపీఎల్‌ వేలం నిర్వహించడానికి సమయం తక్కువగా ఉండడంతో 10 జట్ల నిర్ణయాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే మే నెలలో కొత్త జట్ల వేలానికి సన్నద్ధమవుతున్నారు.

    కాగా, ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. కరోనా నేపథ్యంలో కేవలం ఆరు స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించనున్నారు. ఇటీవలే ప్రారంభమైన నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్)తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఏప్రిల్ 9న చెన్నై వేదికగా జరగనుంది. ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు