• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL RIVALS DAVID WARNER JOFRA ARCHER TO PLAY TOGETHER IN THE HUNDRED 2021 SA

ఒకే జట్టులో ఆడనున్న ఆర్చర్‌,వార్నర్, రసెల్‌.. ఐపీఎల్ తర్వాత...

ఒకే జట్టులో ఆడనున్న ఆర్చర్‌,వార్నర్, రసెల్‌.. ఐపీఎల్ తర్వాత...

David Warner, Jofra Archer To Play Together In The Hundred 2021

ఆసీస్‌ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్‌ వార్నర్‌, ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌, విండీస్‌ హిట్టర్ ఆండీ రసెల్‌ ఒక జట్టుకు ఆడనున్నారు.

  • Share this:
    ఆసీస్‌ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్‌ వార్నర్‌, ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌, విండీస్‌ హిట్టర్ ఆండీ రసెల్‌ ఒక జట్టుకు ఆడనున్నారు. త్వరలోనే వీరు ముగ్గురు కలిసి ఒక టీంలోని కనిపించి ప్రేక్షకులను అలరించినున్నారు. ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు త్వరలో హండ్రెడ్‌ 2021 టోర్నమెంట్‌ను నిర్వహించనునుంది. అయితే ఈ టోర్నమెంట్ 2020 జూన్‌లోనే జరగాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఐపీఎల్‌ 2021 సీజన్‌ ముగిసిన తర్వాత జూలై ఈ టోర్నీ జరగనుంది. మహిళ,పురుషుల టోర్నీమెంట్ ఒక్కే సారి నిర్వహించనున్నారు.

    హండ్రెడ్‌ 2021 పేరుతో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనున్నాయి. జట్ల విషయానికి వస్తే.. నార్తన్‌ సూపర్‌ చార్జర్స్‌, మాంచెస్టర్‌ ఒరిజనల్స్‌ టోర్నీలో జట్లుగా ఉండనున్నాయి. బర్మింగ్‌హమ్‌ ఫోనిక్స్‌, ట్రెంట్‌ రాకెట్స్‌, ఓవల్‌ ఇన్విసిబల్స్‌, సౌతర్న్‌ బ్రేవ్‌, లండన్‌ స్పిరిట్‌, వేల్ష్‌ ఫైర్‌ మెుత్తం 8 జట్లు టోర్నీ ఆడనున్నాయి,





    ఇక జోఫ్రా ఆర్చర్‌, వార్నర్‌, ఆండీ రసెల్‌లు సౌతర్న్‌ బ్రేవ్‌ జట్టు నుంచి ప్రాతినిథ్యం వహించనున్నారు. కాగా ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్‌ సన్‌రైజర్స్, జోప్రా ఆర్చర్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు, ఆండీ రసెల్‌ కోల్‌కతాకు ఆడుతున్న సంగతి తెలిసిందే.
    Published by:Rekulapally Saichand
    First published: