IPL 2021 : యూఏఈ వేదికగా ఐపీఎల్ పార్ట్ 2.. తేదీలను కూడా కన్ఫార్మ్ చేసిన బీసీసీఐ.. ప్రకటన ఎప్పుడంటే..!

ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లకు రూట్ క్లియర్ (PC: iplt20.com)

కరోనా కారణంగా మే 4న ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇక మిగిలిన 31 మ్యాచ్‌లను సెప్టెంబర్ 15 నుంచి నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ నెల 29 జరిగే బీసీసీఐ ప్రత్యేక సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

  • Share this:
    ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. కరోనా కారణంగా అర్దాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021లోని  (IPL 2021)మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI) నిర్ణయించింది. యూఏఈ (UAE) వేదికగా ఈ మ్యాచ్‌లు నిర్వహించాలని.. ఆ మేరకు ఒక నెల విండోను ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు 30 రోజుల్లో మిగిలిన 31 మ్యాచ్‌లను పూర్తి చేయాలని బీసీసీఐ సంకల్పించింది. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB) ‌తో బీసీసీఐ సంప్రదింపులు జరిపినట్లు ఒక జాతీయ పత్రిక కథనం వెలువరించింది. ఈ నెల 29న బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో ఐపీఎల్ 2021కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. అదే రోజు ఐపీఎల్ భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తారని సమాచారం. టీమ్ ఇండియా జూన్ 2న ఇంగ్లాండ్ బయలు దేరి వెళ్లనున్నది. అక్కడ మొదటి న్యూజీలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్నది. ఆ తర్వాత అగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఐదు టెస్టుల సిరీస్ ఇంగ్లాండ్‌తో ఆడనున్నది. దీంతో సెప్టెంబర్ 15 నుంచి ఐపీఎల్ నిర్వహించేందుకు వీలుంటుందని బీసీసీఐ భావిస్తున్నది.

    ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ 41 రోజుల పాటు జరుగనున్నది. 2వ టెస్టుకు 3వ టెస్టుకు మధ్యలో 9 రోజుల గ్యాప్ ఉన్నది. దీన్ని నాలుగు రోజులకు తగ్గించాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డును బీసీసీఐ కోరుతున్నది. అలా చేయడం ద్వారా ఐదవ టెస్టు సెప్టెంబర్ 14 కంటే ముందే ముగించే అవకాశం ఉంటుంది. దీంతో ఐపీఎల్‌ ప్రారంభానికి మరో నాలుగు రోజులు అదనంగా సమయం దొరుకుతుంది. బీసీసీఐకి 30 రోజుల విండో సరిపోతుంది. కానీ మరో నాలుగు రోజులు అదనంగా లభించడం ద్వారా ఇంగ్లాండ్, ఇండియా క్రికెటర్లు యూఏఈ చేరుకోవడానికి సమయం దొరుకుతుంది. లేకపోతే వీరు ఉండే టీమ్‌ల మ్యాచ్‌ల షెడ్యూల్ మార్చాల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీసీసీఐ అనుకుంటున్న సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 విండో మధ్యలో నాలుగు వీకెండ్స్ ఉంటాయి. ఆ 8 రోజుల్లో 16 మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగిలిన మ్యాచ్‌లతో పాటు ప్లేఆఫ్స్‌ను 22 రోజుల్లో అడ్జెస్ట్ చేయాల్సి ఉంటుంది.

    Susheel Kumrar : స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్.. ఢిల్లీ పోలీసులు అతడిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారంటే..!
     ఐపీఎల్ 2021ను వాయిదా వేస్తున్నట్లు మే 4న బీసీసీఐ ప్రకటించింది. అప్పటికి 27 రోజుల్లో 31 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. అదే షెడ్యూల్‌ను యూఏఈలో సెప్టెంబర్ 15 నుంచి కొనసాగించే వీలుంది. గత ఏడాది యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించిన అనుభవం ఉంది కాబట్టి హోటల్ బుకింగ్స్, లాజిస్టిక్స్ పెద్దగా సమస్య కాబోవని బీసీసీఐ భావిస్తున్నది. మరోవైపు ఐసీసీ కూడా బీసీసీఐ చర్యలను గమనిస్తున్నది. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించినా.. టీ20 వరల్డ్ కప్‌కు అడ్డంకి కాబోదని ఐసీసీ అనుకుంటున్నది. ఇప్పటికీ ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను ఇండియా నుంచి తరలిస్తున్నట్లు ప్రకటించలేదు. దీంతో యూఏఈలో ఐపీఎల్ 2021ని నిర్వహించినా ఐసీసీ అభ్యంతరం చెప్పే అవకాశం ఉండదని భావిస్తున్నారు.
    Published by:John Naveen Kora
    First published: