బీసీసీఐకి (BCCI) ఈ ఏడాది ఐపీఎల్ (IPL 2021) కష్టాలు తీరడం లేదు. కరోనా మహమ్మారి కారణంగా 2021 సీజన్ అర్దాంతరంగా వాయిదా పడింది. మొత్తం లీగ్‌లో 60 మ్యాచ్‌లకు గానూ కేవలం 29 మ్యాచ్‌లే జరిగాయి. రెండో విడత మ్యాచ్‌లు అహ్మదాబాద్, ఢిల్లీలో జరుగుతుండగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లతో కరోనా కేసులు వెలుగు చూడటంతో క్యాష్ రిచ్ లీగ్‌ను బీసీసీఐ అర్దాంతరంగా వాయిదా వేసింది. మిగిలిన లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేయడానికి బోర్డు కసరత్తు చేస్తున్నది. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్‌టీపీ) బిజీగా ఉండటంతో బోర్డుకు సరైన విండో దొరకడం లేదు. సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావించినా.. ఇంగ్లాండ్, కివీస్ దేశాలకు చెందిన క్రికెటర్లు లీగ్ ఆడేందుకు సిద్దంగా లేరు. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, యూఏఈ దేశాలు లీగ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దపడుతున్నా.. బీసీసీఐ మాత్రం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నది. తాజాగా ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్ల (New Teams) కోసం పిలవాల్సిన టెండర్లను (Tenders) కూడా వాయిదా వేసింది.
గతంలోనే ఐపీఎల్ 2022 నుంచి మరో రెండు కొత్త ఫ్రాంచైజీలను చేరుస్తామని బీసీసీఐ వెల్లడించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుత ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడటంతో కొత్త టీమ్ టెండర్లు తాత్కాలికంగా వాయిదా వేసింది. వాస్తవానికి మే నెలాఖరులో టెండర్లు పిలవాల్సి ఉన్నా.. రెండు నెలల పాటు టెండర్లు వాయిదా వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 'కొత్త జట్ల కోసం మాట్లాడే సరైన సమయం కాదు. ప్రస్తుతం వాయిదా పడిన లీగ్‌ను పూర్తి చేయడానికి బీసీసీఐ కసరత్తు చేస్తున్నది. ఇప్పట్లో కొత్త టీమ్స్, మెగా వేలం గురించి బీసీసీఐ ఏమీ నిర్ణయం తీసుకోలేదు' అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Cricket : ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ.. టీమ్ ఇండియాతో సిరీస్ ముందు స్టార్ పేసర్ దూరం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, IPL 2021, T20 Auction 2021