IPL Auction 2023 Live Updates: దాదాపు 7 గంటల పాటు సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మినీ వేలం ముగిసింది. మొత్తం 405 మంది వేలంలోకి రాగా.. 80 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ఇందులో 51 మంది భారత ప్లేయర్లు కాగా.. 29 మంది విదేశీ ప్లేయర్స్. వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్ల పంట పండింది. స్యామ్ కరణ్ రూ. 18.50 కోట్లతో ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా రికార్డుకెక్కాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్ ను రూ. 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. బెన్ స్టోక్స్ రూ. 16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిల్ కు రూ 4.40 కోట్ల ధర పలికాడు. ముఖేశ్ కుమార్ ను రూ. 5.50 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోవడం విశేషం. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) అత్యధికంగా 13 మంది ప్లేయర్లను సొంతం చేసుకుంది. అతి తక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 5 మంది ప్లేయర్లను సొంతం చేసుకుంది.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ లో గుంటూరుకు చెందిన షేక్ రషీద్ భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. టి20 ప్రపంచకప్ లో భారత్ చాంపియన్ గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అతడిని వేలంలో రూ. 20 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఐర్లాండ్ కు చెందిన జాషువ లిటిల్ ను రూ. 4.40 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
వేలంలో అమ్ముడైన ప్లేయర్లు
సన్ రైజర్స్ హైదరాబాద్ : బ్రూక్ (13.25, ఇంగ్లండ్), మయాంక్ అగర్వాల్ (8.25), హెన్రిచ్ క్లాసెన్ (రూ.5.25 కోట్లు), వివ్రాంత్ శర్మ (రూ. 2.60 కోట్లు), ఆదిల్ రషీద్ (రూ. 2 కోట్లు), మయాంక్ దగర్ (రూ. 1.80 కోట్లు), అకీల్ హుసేన్ (రూ. కోటి), మయాంక్ మార్ఖండే (రూ. 50 లక్షలు), ఉపేంద్ర సింగ్ (రూ. 25 లక్షలు), సన్వీర్ సింగ్ (రూ. 20 లక్షలు), సమర్థ్ వ్యాస్ (రూ. 20 లక్షలు), అన్మోల్ ప్రీత్ సింగ్ (రూ. 20 లక్షలు), నితీశ్ కుమార్ రెడ్డి (రూ.20 కోట్లు)
ముంబై ఇండియన్స్ : కామెరూన్ గ్రీన్ (రూ.17.5 కోట్లు), జై రిచర్డ్ సన్ (రూ.1.50 కోట్లు), పీయూశ్ చావ్లా (రూ. 50 లక్షలు), డుయాన్ యాన్సెన్ (రూ. 20 లక్షలు), షామ్స్ (రూ. 20 లక్షలు), నెహాల్ (రూ. 20 లక్షలు), విష్ణు వినోద్ (రూ. 20 లక్షలు), రాఘవ్ గోయల్ (రూ. 20 లక్షలు)
లక్నో సూపర్ జెయింట్స్ : నికోలస్ పూరన్ (రూ. 16 కోట్లు), డేనియల్ స్యామ్స్ (రూ. 75 లక్షలు), అమిత్ మిశ్రా (రూ. 50 లక్షలు), జైదేవ్ ఉనాద్కట్ (రూ. 50 లక్షలు), నవీన్ ఉల్ హక్ (రూ. 50 లక్షలు), రొమారియో షెపర్డ్ (రూ. 50 లక్షలు), యశ్ ఠాకూర్ (రూ. 45 లక్షలు), ప్రేరక్ మన్కడ్ (రూ. 20 లక్షలు), స్విప్నిల్ సింగ్ (రూ. 20 లక్షలు), యుద్విర్ చరక్ (రూ. 20 లక్షలు)
చెన్నై సూపర్ కింగ్స్ : బెన్ స్టోక్స్ (రూ.16.25 కోట్లు), కైల్ జెమీసన్ (రూ. కోటి), నిషాంత్ సింధు (రూ.60 లక్షలు), రహానే (50 లక్షలు), షేక్ రషీద్ (రూ. 20 లక్షలు), అజయ్ మండల్ (రూ. 20 లక్షలు), భగత్ వర్మ (రూ. 20 లక్షలు).
పంజాబ్ కింగ్స్ : స్యామ్ కరణ్ (రూ. 18.5 కోట్లు), సికిందర్ రాజా (రూ.50 లక్షలు), హర్ ప్రీత్ భాటియా (రూ. 40 లక్షలు), విద్వాత్ కవరప్ప (రూ. 20 లక్షలు), శివమ్ సింగ్ (రూ. 20 లక్షలు), మోహిత్ (రూ. 20 లక్షలు)
గుజరాత్ టైటాన్స్ : శివమ్ మావి (రూ.6 కోట్లు), జాష్ లిటిల్( రూ. 4. 4 కోట్లు), కేన్ విలియమ్సన్ (రూ. 2 కోట్లు), కేఎస్ భరత్ (రూ. 1.20 కోట్లు), ఒడిన్ స్మిత్, (రూ. 50 లక్షలు), మోహిత్ శర్మ (రూ. 50 లక్షలు), ఉర్విల్ పటేల్ (రూ. 20 లక్షలు)
రాజస్తాన్ రాయల్స్ : జేసన్ హోల్డర్ (రూ. 5.75 కోట్లు), ఆడం జంపా (రూ. 1.50 కోట్లు), జో రూట్ (రూ. కోటి), డెవోన్ ఫెరీరా (రూ. 50 లక్షలు), కేఎం ఆసిఫ్ (రూ. 50 లక్షలు), అబ్దుల్ (రూ. 20 లక్షలు), ఆకాశ్ (రూ. 20 లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ. 20 లక్షలు), కునాల్ రాథోర్ (రూ. 20 లక్షలు)
కోల్ కతా నైట్ రైడర్స్ : షకీబుల్ హసన్ (రూ. 1.5 కోట్లు), డేవిడ్ వీస్ (రూ. కోటి), జగదీశన్ (రూ. 90 లక్షలు), వైభవ్ అరోరా (రూ. 60 లక్షలు), లిట్టన్ దాస్ (రూ. 30 లక్షలు), సూయాశ్ శర్మ (రూ. 20 లక్షలు), కుల్వంత్ (రూ. 20 లక్షలు)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : విల్ జాక్స్ (రూ. 3.20 కోట్లు), రీస్ టాప్లీ (రూ. 1.90 కోట్లు), రజన్ కుమార్ (రూ. 70 లక్షలు), అవినాశ్ సింగ్ (రూ. 60 లక్షలు), సోనూ యాదవ్ (రూ. 20 లక్షలు), మనోజ్ (రూ. 20 లక్షలు), హిమాన్షు శర్మ (రూ. 20 లక్షలు),
ఢిల్లీ క్యాపిటల్స్ : ముఖేశ్ కుమార్ (రూ. 5.5 కోట్లు), రైలీ రోసో (రూ. 4.60 కోట్లు), మనీశ్ పాండే (రూ. 2.4 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ. 2 కోట్లు), ఇషాంత్ శర్మ (రూ. 50 లక్షలు)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, Gujarat Titans, Indian premier league, IPL, IPL 2023 Mini Auction, Kolkata Knight Riders, Punjab kings, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad