ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో (IPL 2021) ఇప్పటికే 25 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ సారి మంచిగా ప్రదర్శన చేస్తాయని అనుకున్న టీమ్స్ వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నాయి. ఏయే జట్టులో లోపాలు, బలహీనతలు ఏమిటో అందరికీ తెలిసి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టులో మ్యాచ్ ఫినిషర్ లేక ఇబ్బంది పడుతున్నది. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టులో కీలక బౌలర్లు లేక సతమతం అవుతున్నది. జోఫ్రా ఆర్చర్ సీజన్‌కు ముందే అందుబాటులో లేకుండా పోగా.. ఆండ్రూ టై కరోనా భయాందోళనతో మధ్యలోనే ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయాడు. ఇక కోల్‌కతా నైట్రైజడర్స్ జట్టు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి పరిమితం అయ్యింది. ఈ నేపథ్యంలో పలు జట్లు మిడ్-సీజన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇతర ఫ్రాంచైజీల్లో ఉన్న ఆటగాళ్లను అప్పుగా తెచ్చుకోవాలని భావిస్తున్నది. మిడ్-సీజన్ ట్రాన్స్ఫర్లో (Mid Season Transfer) ఆటగాళ్లు కేవలం ఇతర జట్లకు లోన్ మీద మాత్రమే బదిలీ చేయబడతారు. ఏప్రిల్ 26 రాత్రి 9 గంటలకు ఈ బదిలీలకు బీసీసీఐ విండోను ఓపెన్ చేసింది. మే 23 వరకు ఫ్రాంచైజీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఎవరైనా ఆటగాడిని ఫ్రాంచైజీల మధ్య బదిలీ చేయాలంటే.. అతడు తన ఫ్రాంచైజీ తరపున ఈ సీజన్లో 3 మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడి ఉండకూడదు. సదరు ఆటగాడిని బదిలీ చేసినా.. సీజన్ ముగిసే వరకు అతడు సొంత ఫ్రాంచైజీ సభ్యుడిగానే పరిగణిస్తారు. ఇతర ఫ్రాంచైజీకి వెళ్లిన తర్వాత ఆ ఆటగాడు తన సొంత ఫ్రాంచైజీతో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉండాలి. ఆ మ్యాచ్ ఆడటానికి అతడికి అర్హత ఉండదు. ఈ సీజన్‌కు సంబంధించిన పూర్తి జీతం తన సొంత ఫ్రాంచైజీనే చెల్లించాలి. అయితే తనను అప్పుగా తీసుకున్న ఫ్రాంచైజీ మాత్రం మ్యాచ్‌కు కొంత ఫీజుగా చెల్లించాలి. ఒక ఫ్రాంచైజీ ముగ్గరి కంటే ఎక్కువ మంది క్రికెటర్లను అప్పుగా తీసుకునే వీలు ఉండదు. ఈ నిబంధనలు అన్నీ పాటిస్తూ ఆటగాళ్లను మిడ్-సీజన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్ ప్రారంభానికి ముందే రాబిన్ ఊతప్పను చెన్నై సూపర్ కింగ్స్‌కు అమ్మేసింది. ఇప్పుడు రాయల్స్ పరిస్థితి దారుణంగా ఉండటంతో ఊతప్పను తిరిగి అప్పుగా తెచ్చుకోవాలని భావిస్తున్నది. జోఫ్రా ఆర్చర్, లియామ్ లివింగ్స్టన్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై జట్టుకు దూరం అవడంతో జేసన్ రాయ్‌ని అప్పుగా తెచ్చుకోవాలని భావిస్తున్నది. జేసన్ రాయ్ ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు. సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. హైదరాబాద్ విదేశీ ప్లేయర్ల స్లాట్స్ కూడా నిండుగా ఉన్నాయి. దీంతో అతడిని తీసుకోవాలని భావిస్తున్నది. అలాగే ఇషాన్ పోరెల్‌పై కూడా రాయల్స్ కన్నేసింది. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టకు చెందిన అడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ జట్టను వీడారు. వీరి స్థానంలో కేకేఆర్ జట్టులో ఉన్న లాకీ ఫెర్గూసన్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2021, Kolkata Knight Riders, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad