RCB vs KKR: రాణించిన కోహ్లీ, డివిల్లియర్స్... రాయల్ ఛాలెంజర్స్ భారీ స్కోరు...

RCB vs KKR: విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ హాఫ్ సెంచరీలు... రెండో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ, డివిల్లియర్స్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 5, 2019, 10:13 PM IST
RCB vs KKR: రాణించిన కోహ్లీ, డివిల్లియర్స్... రాయల్ ఛాలెంజర్స్ భారీ స్కోరు...
విరాట్ కోహ్లీకి ఇది ఐపీఎల్‌ కెరీర్‌లో 35వ హాఫ్ సెంచరీ...
  • Share this:
IPL 2019 Live Score, RCB vs KKR in Bangalore: బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ నుంచి ఎలాంటి ఆటను అభిమానులు కోరుకున్నారో, అలాంటి ఆటను సీజన్‌లో మొదటిసారి చూపించింది ఆర్‌సీబీ. సీజన్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయిన కింగ్ కోహ్లీ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్ తన అసలైన ఆటను రుచి చూపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 205 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. మొదటి ఓవర్ నుంచే బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు ఓపెనర్లు. సీజన్‌లో మొదటిసారిగా ఆర్‌సీబీ ఓపెనర్లు మొదటి వికెట్‌కు 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటి వికెట్‌కు 64 పరుగులు జోడించిన తర్వాత పార్థివ్ పటేల్ అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన పార్థివ్ పటేల్, నితీశ్ రాణా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటై పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 31 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ బాదాడు విరాట్ కోహ్లీ. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీకి ఇది మొదటి హాఫ్ సెంచరీ కాగా, ఐపీఎల్ కెరీర్‌లో 35వ హాఫ్ సెంచరీ. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ తర్వాత అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో హాప్ సెంచరీ నమోదుచేశాడు ఏబీ డివిల్లియర్స్.

RCB vs KKR, rcb vs kkr live score, royal challengers Bangalore vs kolkata knight riders ipl 2019, ipl 2019, royal challengers bangalore, RCB Ipl 2019, ipl points table rcb, virat kohli runs in ipl 2019, ab de Villiers ipl 2019, chahal wickets ipl 2019, umesh yadav wickets 2019 ipl, ఐపిఎల్ 2019, ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ 2019, విరాట్ కోహ్లీ 2019, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2019 ఐపీఎల్, యజ్వేంద్ర చాహాల్ వికెట్స్ 2019 ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019, ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఆర్‌సీబీ, బెంగళూరు విరాట్ కోహ్లీ ఏబీ డివిల్లియర్స్
ఏబీ డివిల్లియర్స్‌కు ఇది ఐపీఎల్‌లో 30వ హాఫ్ సెంచరీ


49 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే భారీ షాట్‌కు ప్రయత్నించిన ఏబీ డివిల్లియర్స్‌, శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసి నరైన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు డివిల్లియర్స్. కోహ్లీ, ఏబీడీ రెండో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత స్టోయినిస్ 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేయడంతో బెంగళూరు స్కోరు 200 మార్క్ దాటింది.


POINTS TABLE:


SCHEDULE TIME TABLE:


ORANGE CAP:


PURPLE CAP:


RESULTS TABLE:


RCB vs KKR: తొలి విజయం కోసం విరాట్ సేన తహతహ... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో ఢీ...

IPL 2019: రాయల్ ఛాలెంజర్స్‌ ఈ గతికి కారణమేంటి... విరాట్ సేనకు ఏమైంది...
Published by: Ramu Chinthakindhi
First published: April 5, 2019, 9:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading