RCB vs CSK: పార్థివ్ పటేల్ హాఫ్ సెంచరీ... చెన్నైకి మంచి టార్గెట్ ఫిక్స్ చేసిన బెంగళూరు...
IPL 2019 Live Score, RCB vs CSK in Bangalore: పార్థివ్ పటేల్ హాఫ్ సెంచరీ... దీపక్ చాహార్, జడేజా, బ్రావోలకు రెండేసి వికెట్లు

IPL 2019 Live Score, RCB vs CSK in Bangalore: పార్థివ్ పటేల్ హాఫ్ సెంచరీ... దీపక్ చాహార్, జడేజా, బ్రావోలకు రెండేసి వికెట్లు
- News18 Telugu
- Last Updated: April 21, 2019, 9:59 PM IST
IPL 2019 Live Score, RCB vs CSK in Bangalore: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ప్రారంభంలోనే విరాట్ కోహ్లీ (9 పరుగులు)ని అవుట్ చేసిన దీపక్ చాహార్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తొలి బ్రేక్ అందించాడు. అయితే ఏబీ డివిల్లియర్స్‌తో కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు పార్థివ్ పటేల్. 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 25 పరుగులు చేసిన డివిల్లియర్స్... జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, బౌండరీ లైన్ దగ్గర డుప్లిసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది బెంగళూరు. ఆ తర్వాత 20 బంతుల్లో 24 పరుగులు చేసిన అక్ష్దీప్ సింగ్ కూడా జడేజా బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ చేరాడు. అయితే ఓ వైపు వికెట్లు పుడతున్నా జోరు కొనసాగించిన పార్థివ్ పటేల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో అర్ధ శతకం నమోదుచేశాడు పార్థివ్ పటేల్. హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాతి బంతికే భారీ షాట్ ప్రయత్నించి, అవుట్ అయ్యాడు పార్థివ్ పటేల్.
ఆ తర్వాత భారీ షాట్ ఆడిన స్టోయినిస్‌ను సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ డుప్లిసిస్ అద్భుత క్యాచ్‌తో అవుట్ చేశాడు. సిక్స్ వెళ్లాల్సిన బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్న డుప్లిసిస్, బంతిని వెంటనే అక్కడే ఉన్న షోర్నేకు పాస్ చేశాడు. ఆ తర్వాత పవన్ నేగీ 5 పరుగులు చేసి, చాహార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. చివర్లో 5 ఫోర్లతో 26 పరుగులు సాధించిన మొయిన్ ఆలీ కూడా బ్రావో బౌలింగ్‌లోనే అవుటై పెవిలియన్ చేరాడు. దీపక్ చాహార్, జడేజా, బ్రావోలకు రెండేసి వికెట్లు దక్కగా, ఇమ్రాన్ తాహీర్‌లకు ఓ వికెట్ దక్కాయి.

ప్యాంటు తడిచేలా రక్తం కారుతున్నా... బ్యాటింగ్ వదలని వాట్సన్
IPL 2019 Final: ధోని రనౌట్ నిర్ణయం తప్పేనా?.. అప్పడు ఏం జరిగింది?
IPL Final: అంపైర్ నిర్ణయాన్ని అవహేళన చేశాడు.. దెబ్బకు ఆ క్రికెటర్‌కు..
IPL: ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్‌కింగ్స్ ఓడింది అందుకేనా..
IPL 2019 Final Live Score, MI vs CSK : ఐపీఎల్ 2019 విజేత ముంబై ఇండియన్స్...ఉత్కంఠభరిత మ్యాచ్ గెలుపుతో నాలుగో సారి టైటిల్ సొంతం
MI Vs CSK : ఇద్దరిలో ఇప్పటివరకు ఎవరెన్నిసార్లు కప్ ఎగరేసుకెళ్లారు?
Loading...