MI vs CSK: ముంబై ఇండియన్స్ భారీ స్కోరు ... చెన్నై సూపర్‌కింగ్స్ టార్గెట్ 171...

IPL Live Score, MI vs CSK Match at Wankhede: 59 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్... చివర్లో దూకుడు చూపించిన హార్దిక్ పాండ్యా, పొలార్డ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 3, 2019, 10:24 PM IST
MI vs CSK: ముంబై ఇండియన్స్ భారీ స్కోరు ... చెన్నై సూపర్‌కింగ్స్ టార్గెట్ 171...
సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ...
  • Share this:
MI vs CSK: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆరంభంలో గట్టి దెబ్బ తగిలింది. 4 పరుగులు చేసి డి కాక్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో కేదార్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. సూర్యకుమార్ వరుస బౌండరీలు సాధిస్తూ జోరు మీద ఉండడంతో రోహిత్ సింగిల్స్ తీస్తూ అతనికి స్టైక్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బందిపడిన రోహిత్ శర్మ, జడేజా బౌలింగ్‌లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఈ బాల్ వేసినప్పడు రవీంద్ర జడేజా కాలు లైన్‌కి చాలా దగ్గర్లో ఉండడంతో అది ‘నో బాల్’ అనే సస్పెన్స్ నెలకొంది. టీవీ రివ్యూలో చూసిన తర్వాత రోహిత్‌ను అవుట్‌గా ప్రకటించారు అంపైర్లు. ఆ తర్వాత ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన యువరాజ్‌ను బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన క్యాచ్‌తో అవుట్ చేశాడు అంబటి రాయుడు. కృనాల్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఇద్దరూ నాలుగో వికెట్‌కు 48 బంతుల్లో 62 పరుగులు జోడించిన తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించి కృనాల్ పాండ్యా అవుట్ అయ్యాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 42 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా, మోహిత్ శర్మ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

38 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. 43 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్స్‌తో 59 పరుగులు చేసిన తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించిన సూర్యకుమార్ యాదవ్... జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పొలార్డ్, హార్దిక్ పాండ్యా కలిసి స్కోరు 160 పరుగులు దాటించారు. బ్రావో వేసిన చివరి ఓవర్లో 29 పరుగులు రాబట్టారు ఈ ఇద్దరూ. చివరి రెండు ఓవర్లలో 45 పరుగులు రావడం విశేషం. హార్దిక్ పాండ్యా 25 పరుగులు, పొలార్డ్ 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
Published by: Ramu Chinthakindhi
First published: April 3, 2019, 10:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading