KKR vs DC: రాణించిన గిల్, రస్సెల్... కోల్‌కత్తా భారీస్కోరు... ఢిల్లీ టార్గెట్ 179...

IPL 2019 Live Score, KKR vs DC Match at Kolkata: శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ... 45 పరుగులు చేసిన రస్సెల్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 12, 2019, 9:46 PM IST
KKR vs DC: రాణించిన గిల్, రస్సెల్... కోల్‌కత్తా భారీస్కోరు... ఢిల్లీ టార్గెట్ 179...
IPL 2019 Live Score, KKR vs DC Match at Kolkata: శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ... 45 పరుగులు చేసిన రస్సెల్...
  • Share this:
IPL 2019 Live Score, KKR vs DC Match at Kolkata: కోల్‌కత్తా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా జట్టు... మొదటి బంతికే వికెట్ కోల్పోయింది. డెన్లీని క్లీన్‌బౌల్డ్ చేసి, ఢిల్లీకి అదిరిపోయే షాక్ ఇచ్చాడు ఇషాంత్ శర్మ. అయితే ఆ తర్వాత శుబ్‌మన్ గిల్, రాబిన్ ఊతప్ప కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేశారు. రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించిన తర్వాత రాబిన్ ఊతప్ప అవుట్ అయ్యాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన ఊతప్ప, రబాడా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 11 పరుగులు చేసిన నితీశ్ రాణాను క్రిస్ మోరిస్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా బ్యాటింగ్ చేసిన యంగ్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన గిల్... భారీ షాట్‌కు ప్రయత్నించి, అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు గిల్. ఆ తర్వత క్రీజులోకి వచ్చిన కార్తీక్ కేవలం 2 పరుగులకే వెనుదిరగగా, ఆండ్రే రస్సెల్ మరోసారి వీరబాదుడు బాదాడు. 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేసిన రస్సెల్... మోరిస్ బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

రస్సెల్ అవుటైన తర్వాత బ్రాత్‌వైట్ ఆరు పరుగులు చేసి అవుట్ కాగా, పియూష్ చావ్లా 14 పరుగులు, కుల్దీప్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

POINTS TABLE:


SCHEDULE TIME TABLE:


ORANGE CAP:

PURPLE CAP:


RESULTS TABLE:
Published by: Ramu Chinthakindhi
First published: April 12, 2019, 9:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading