KKR vs DC: కోల్‌కత్తాకు షాక్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్... ధావన్ సెంచరీ మిస్...

IPL 2019 Live Score, KKR vs DC: 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన శిఖర్ ధావన్... పంత్ హాఫ్ సెంచరీ మిస్... 7 వికెట్ల తేడాతో ఢిల్లీ అద్భుత విజయం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 13, 2019, 9:37 AM IST
KKR vs DC: కోల్‌కత్తాకు షాక్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్... ధావన్ సెంచరీ మిస్...
IPL 2019 Live Score, KKR vs DC: 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన శిఖర్ ధావన్... పంత్ హాఫ్ సెంచరీ మిస్... 7 వికెట్ల తేడాతో ఢిల్లీ అద్భుత విజయం...
  • Share this:
IPL 2019 Live Score, KKR vs DC Match at Kolkata: భారీ హిట్టర్లున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకు యువకులతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అదిరిపోయే షాక్ ఇచ్చింది. 179 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ అలవోకగా చేధించి, పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కొట్టేయాలన్న కోల్‌కత్తా కోరికను మరికొంత కాలం వేచి చూసేలా చేసింది. అన్నింటికీ మించి వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్‌లోకి రావడం క్రికెట్ ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగించే విషయం. 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. అయితే రెండు సిక్సర్లతో 14 పరుగులు చేసిన పృథ్వీషా... ప్రసిద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 6 పరుగులకే అవుట్ కావడంతో 57 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. అయితే వరుస మ్యాచుల్లో విఫలమవుతూ వస్తున్న స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కీలక సమయంలో ఆదుకున్నాడు. యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తోడుగా భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు.

మూడో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన తర్వాత రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసిన రిషబ్ పంత్, నితీశ్ రాణా బౌలింగ్‌లో కుల్దీప్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. విజయానికి 5 పరుగులు కావల్సిన దశలో ఇన్‌గ్రామ్ సిక్స్ కొట్టడంతో ధావన్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ అయ్యాడు. 63 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. ఇన్‌గ్రామ్ 14 పరుగులు చేశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగుల భారీ స్కోరు చేసింది. మొదటి బంతికే డెన్లీని క్లీన్‌బౌల్డ్ చేసి, ఢిల్లీకి అదిరిపోయే షాక్ ఇచ్చాడు ఇషాంత్ శర్మ. అయితే ఆ తర్వాత శుబ్‌మన్ గిల్, రాబిన్ ఊతప్ప కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేశారు. రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించిన తర్వాత రాబిన్ ఊతప్ప అవుట్ అయ్యాడు. ఊతప్ప 28 పరుగులు, నితీశ్ రాణా 11 పరుగులు చేసి అవుట్ అయ్యారు. యంగ్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. కార్తీక్ కేవలం 2 పరుగులకే వెనుదిరగగా, ఆండ్రే రస్సెల్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. చివర్లో పియూష్ చావ్లా 14 పరుగులు, కుల్దీప్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

SCHEDULE TIME TABLE:



RESULTS TABLE:
First published: April 13, 2019, 9:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading