SRH vs DC: సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విక్టరీ..సొంత గ్రౌండ్‌లో ఢిల్లీ ఓటమి

శుక్రవారం రాత్రి 8 గంటలకు బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తలపడనున్నాయి.

news18-telugu
Updated: April 5, 2019, 10:15 AM IST
SRH vs DC: సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విక్టరీ..సొంత గ్రౌండ్‌లో ఢిల్లీ ఓటమి
బెయిర్‌స్టో
  • Share this:
SRH vs DC: ఐపీఎల్-12 సీజన్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా గ్రౌండ్‌లో ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సింపుల్‌గా గెలవాల్సిన మ్యాచ్‌ను చివరి దాకా తీసుకొచ్చింది రైజర్స్ జట్టు. బెయిర్‌స్టో ఔటైన తర్వాత వరుసగా వికెట్లు పడడంతో కొంత ఇబ్బంది పడింది. ఐతే గెలవాల్సిన లక్ష్యం తక్కువగా ఉండడంతో ఎట్టకేలకు గెలిచింది సన్‌రైజర్స్. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ఒక దశలో 6 ఓవర్లకే 60 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించింది హైదరాబాద్ జట్టు. ఐతే ఏడో ఓవర్లో బెయిర్ స్టో అవుటవడం, ఆ తర్వాతి ఓవర్లోనే వార్నర్ వికెట్ కూడా కోల్పోవడంతో స్కోర్ వేగం మందగించింది. బెయిర్ స్టో 28 బంతుల్లోనే 48 పరుగులు చేసి సత్తాచాటాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. వార్నర్ 10, విజయ్ శంకర్ 16, మనీశ్ పాండే 10, దీపక్ హుడా 10 పరుగులు చేశారు. యూసుఫ్ పఠాన్ 9, నబీ 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాత్రమే రాణించాడు. 43 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో అక్షర్ పటేల్(23 రన్స్) మెరవడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇక ఢిల్లీలో మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. కోల్‌కతాపై మెరుపులు మెరిపించిన పృథ్వీ షా 11 పరుగులు మాత్రమే చేశాడు. శిఖర్ ధావన్ 12 పరుగులు చేయగా.. అటాకింగ్ స్టార్ రిషబ్ పంత్ సైతం 5 రన్స్‌కే వెనుదిరిగాడు. మిగతా ప్లేయర్లు కూడా పెద్దగా రాణించలేదు. ఇక హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, మహమ్మద్ నబీ, సిద్దార్థ్ కౌల్ రెండేసి వికెట్లు తీశారు. రషీద్ ఖాన్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.

ఇక శుక్రవారం రాత్రి 8 గంటలకు బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తలపడనున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: April 4, 2019, 11:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading