CSK vs KKR: టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ... కోల్‌కత్తా బ్యాటింగ్...

మహేంద్ర సింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్

పాయింట్ల పట్టికలో టాప్ ఉన్న జట్ల మధ్య హోరాహోరీ పోరు... సీఎస్‌కే vs కెకెఆర్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం...

  • Share this:
IPL 2019 Live Score, CSK vs KKR in Chennai: చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో రెండు జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. చెరో నాలుగు విజయాలతో టేబుల్ టాప్‌లో ఉన్న జట్ల మధ్య పోరు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా బీభత్సమైన ఫామ్‌తో సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఆండ్రే రస్సెల్‌ను, చెన్నై ఎలా ఎదుర్కొంటుదనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ఆతిథ్య చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ... సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతనితో పాటు డుప్లిసిస్ కూడా జట్టుకు అదనపు బలంగా మారాడు. సురేశ్ రైనా, అంబటి రాయుడు కూడా మంచి టచ్‌లోకి వచ్చారు. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి భారీ స్కోరు ఆశిస్తున్నారు అభిమానులు. మరోవైపు ఎంత పెద్ద స్కోరునైనా ఛేజ్ చేయగలమని నిరూపించుకుంది కోల్‌కత్తా. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో మ్యాచ్‌లో రస్సెల్ చెలరేగి, అద్భుత విజయం అందించాడు. అతనితో పాటు క్రిస్‌లీన్, సునీల్ నరైన్, నితీశ్ రాణా అదరగొడుతున్నారు. బౌలింగ్‌లోనూ అటు హర్భజన్, ఇటు కుల్దీప్ ఉండడంతో ఇరుజట్ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతుందని క్రికెట్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. చెన్నైలో మంగళవారం సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: డుప్లిసిస్, షేన్ వాట్సన్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ధోనీ, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహార్, స్కాట్ కుగ్గేలిజిన్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు: క్రిస్‌లీన్, నరైన్, రాబిన్ ఊతప్ప, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, శుబ్‌మన్ గిల్, ఆండ్రే రస్సెల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, హ్యారీ గుర్నే, ప్రసిద్ధ్ కృష్ణ

POINTS TABLE:


SCHEDULE TIME TABLE:


ORANGE CAP:


PURPLE CAP:


RESULTS TABLE:
First published: