Home /News /sports /

IPL FRANCHISES AND BCCI ARE IN FEAR ABOUT SECOND PHASE OF MEGA LEAGUE AMID COVID CASES IN TEAM INDIA JNK

IPL 2021: అదే జరిగితే ఐపీఎల్ రెండో ఫేజ్ జరగడం కష్టమే.. ఆందోళనలో బీసీసీఐ, ఫ్రాంచైజీలు..

ఐపీఎల్ 2021 రెండో దశపై నీలినీడలు.. మెగా లీగ్ జరిగేనా?

ఐపీఎల్ 2021 రెండో దశపై నీలినీడలు.. మెగా లీగ్ జరిగేనా?

IPL 2021: ఐపీఎల్ 2021 రెండో దశ మరో 9 రోజుల్లో యూఏఈ వేదికగా ప్రారంభం కానున్నది. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న టీమ్ ఇండియాలో కరోనా కలకలం రేగడంతో ఆ ప్రభావం ఐపీఎల్ మీద పడుతుందేమోనని ఫ్రాంచైజీలు ఆందోళన చెందుతున్నాయి.

    ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశ ఈ నెల 19 నుంచి యూఏఈ (UAE) లోని మూడు వేదికల్లో ప్రారంభం కానున్నది. అయితే ఇంగ్లాండ్-ఇండియా (IndiaVs England) సిరీస్ మధ్యలో కోవిడ్ (Covid) కలకలం రేగడంతో ఇప్పుడు ఆ ప్రభావం ఐపీఎల్ రెండో దశపై పడింది. భారత జట్టు (Team India) లోని ఆటగాళ్లకు తాజాగా చేసిన కోవిడ్ టెస్టు (గురువారం రాత్రి)లో అందరూ నెగెటివ్‌గా నిర్దారణ అయ్యారు. ఒక్క బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మినహా.. సహాయక సిబ్బంది అందరూ పాజిటివ్ నిర్దారణ అయ్యి ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. హెడ్ కోచ్ సహా.. ఇతర సిబ్బంది లేకుండానే నేటి నుంచి మాంచెస్టర్‌లో టెస్టు ఆడనున్నది. సెప్టెంబర్ 14న టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియాలో ఐపీఎల్ ఆటగాళ్లు యూఏఈకి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. యూఏఈ చేరుకున్న తర్వాత ఆటగాళ్లందరూ తమ తమ ఫ్రాంచైజీలతో చేరనున్నారు.

    రాబోయే ఐదు రోజుల్లో టీమ్ ఇండియాలో ఏ ఒక్క ప్లేయర్ పాజిటివ్ వచ్చినా అందరు ఆటగాళ్లు ఐసోలేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జట్టులో ఉన్న క్రికెటర్లు, రిజర్వ్ ప్లేయర్లు కనుక 14 రోజుల పాటు ఐసోలేషన్‌కు వెళితే ఐపీఎల్ రెండో దశకు ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతం అన్ని ఫ్రాంచైజీలు యూఏఈలో ఉన్నాయి. ఐసోలేషన్‌లో లేని ప్లేయర్లు తమ ఫ్రాంచైజీలతో కలసి అవకాశం లేదు. కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ తమ జట్లకు కెప్టెన్లుగా ఉన్నారు. వీళ్లు కనుక మిస్ అయితే ఆయా ఫ్రాంచైజీలకు పెద్ద నష్టమే కాకుండా.. ఐపీఎల్‌కు ఉన్న ఎట్రాక్షన్ కూడా తగ్గిపోతుంది. కీలకమైన ఇండియన్ ప్లేయర్లు లేకుండా బీసీసీఐ ఈ మెగా లీగ్‌ను కొనసాగిస్తున్నదా అనేది అనుమానమే.

    INDvsENG: ఐదో టెస్టుపై మెలిక పెట్టిన ఈసీబీ.. మీ పప్పులు ఉడకవంటూ బీసీసీఐ.. ఇరు బోర్డుల మధ్య వివాదం


     ఇప్పటికే పలు ఫ్రాంచైజీల్లో విదేశీ ప్లేయర్లు గైర్హాజరు అవుతుండటంతో ఫ్రాంచైజీలు ఆందోళనలో ఉన్నాయి. ఇక టీమ్ ఇండియా ఆటగాళ్లు కూడా దూరమైతే ఐపీఎల్ జరగడం కష్టమే అని భావిస్తున్నాయి. మరోవైపు కోవిడ్ పాజిటివ్ అయితే యూఏఈ ప్రభుత్వం ఎవరినీ దేశంలోనికి రానివ్వడం లేదు. ఇది కేవలం ఐపీఎల్‌కే కాకుండా టీ20 వరల్డ్ కప్‌కు కూడా పెద్ద ఆటంకమే. ఇది కేవలం ఫ్రాంచైజీల బాధ మాత్రమే కాకుండా బీసీసీఐ ఆందోళన కూడా. ఐపీఎల్ ఈ సారి వాయిదా పడితే ఏకంగా రద్దు చేయడం తప్ప మరో ఆప్షన్ ఉండదు. అందుకే ప్రస్తుతం మాంచెస్టర్‌లో టీమ్ ఇండియా ఆటగాళ్లకు కఠినమైన బయోబబుల్ అమలు చేస్తున్నారు. రాబోయే 5 రోజులు గ్రౌండ్‌లోనే కాకుండా బయట కూడా కఠిన నియమనిబంధనలు పాటించాలని ఆటగాళ్లందరికీ ఆదేశాలు అందాయి. ఇప్పుడు మళ్లో సారి కరోనా కలకలం రేగితే.. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌కు ఆటంకం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, IPL 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు