• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL FIRST MILESTONES WHO TOOK FIRST WICKET WHO SCORED FIRST CENTURY JNK

IPL 2021 : ఐపీఎల్‌లో తొలి సారి నమోదైన మైలురాళ్లు ఏమిటో తెలుసా? తొలి వికెట్ ఎవరు తీశారు?

IPL 2021 : ఐపీఎల్‌లో తొలి సారి నమోదైన మైలురాళ్లు ఏమిటో తెలుసా? తొలి వికెట్ ఎవరు తీశారు?

ఐపీఎల్ చరిత్రలో తొలి మైలు రాళ్లు ఇవే. [PC : iplt20.com]

  • Share this:
    ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్(IPL 2021). బీసీసీఐ (BCCI) ఆధ్వర్యంలో 2008లో ఈ క్రికెట్ లీగ్ ప్రారంభమైంది. టీ20 ఫార్మాట్‌లో (T20 Format) అప్పటికే ఇంగ్లాండ్‌లో ఒక లీగ్ జరుగుతుండేది. అంతే కాకుండా ఆయా దేశాల్లో చిన్న చిన్న ప్రైవేట్ లీగ్స్ కూడా నిర్వహించేవాళ్లు. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మనుగడలోకి వచ్చిన తర్వాత క్రికెట్ ప్రపంచంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరుపొందింది. 2008లో నిర్వహించిన తొలి ఎడిషన్‌లోనే లీగ్ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న 14 సీజన్ వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా లీగ్ నిర్విరామంగా కొనసాగుతున్నది. అయితే ఈ లీగ్‌లో మొట్టమొదటిగా జరిగిన మైలు రాళ్లు ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం.

    ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య 18 ఏప్రిల్ 2008న బెంగళూరులో జరిగింది.

    ఐపీఎల్‌లో తొలి బంతిని ప్రవీణ్ కుమార్ వేయగా.. కేకేఆర్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సింగిల్ తీశారు.

    కేకేఆర్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ తొలి ఫోర్ కొట్టాడు. జహీర్ ఖాన్ వేసిన ఓవర్‌లో తాను ఎదుర్కున్న తొలి బంతికే బౌండరీకి తరలించాడు.

    బ్రెండన్ మెక్‌కల్లమ్ అదే ఓవర్ 5వ బంతికి సిక్స్ కొట్టాడు. ఐపీఎల్‌లో నమోదైన తొలి సిక్స్ ఇదే.

    ఐపీఎల్‌లో తొలి వికెట్ జహీర్ ఖాన్ తీసుకున్నాడు. 6వ ఓవర్‌లో సౌరవ్ గంగూలీ స్లిప్‌లో ఉన్న జాక్వెస్ కల్లీస్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.

    ఆర్సీబీ బ్యాట్స్‌మాన్ ఆష్లే నొఫేక్ లీగ్‌లో తొలి సారి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అజిత్ అగార్కర్ ఫీల్డ్ చేసి బంతిని వేయగా కీపర్ వృద్దిమాన్ సాహ వికెట్లను గిరాటేశాడు.

    ఐపీఎల్ 2008 సీజన్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మాన్ రాబిన్ ఊతప్ప తొలి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఆర్సీబీ బౌలర్ రామచంద్ర అఖిల్ వేసిన బంతిని షాట్ కొట్టబోయి మిస్ చేయగా.. కీపర్ మార్క్ బౌచర్ స్టంపింగ్ చేశాడు.

    ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మధ్య మొహలీలో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మాన్ ముసావిర్ ఖోటే తొలి హిట్ వికెట్‌గా అవుటయ్యాడు. శ్రీశాంత్ బౌలింగ్‌లో ఈ ఘటన జరిగింది.

    ఐపీఎల్ సీజన్ 12లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా జాస్ బట్లర్‌ను అవుట్ చేశాడు.

    ఐపీఎల్ 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్ మెక్‌గ్రాత్ తొలి మెయిడెన్ ఓవర్ వేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ మెయిడెన్ ఓవర్‌గా వేయడమే కాకుండా షేన్ వాట్సన్‌ను అవుట్ చేశాడు.

    కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ తొలి మ్యాచ్‌లోనే 158 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ విధంగా ఐపీఎల్‌లో తొలి 50, తొలి సెంచరీ, తొలి 150 అతని పేరు మీదే ఉన్నాయి. కేవలం 70 బంతుల్లో 150 పరుగుల మార్కును అందుకున్నాడు.

    ఐపీఎల్‌లో తొలి 5 వికెట్ల ప్రదర్శన సోహైల్ తన్వీర్ పేరిట ఉన్నది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ తన్వీర్ 6/14 ప్రదర్శన చేశారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ ఇదే ఉత్తమ ప్రదర్శన.

    ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ కోల్‌కతా నైడర్స్ గెలిచారు. కానీ తొలి టైటిల్ విజేత మాత్రం రాజస్థాన్ రాయల్స్. ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది.
    Published by:John Naveen Kora
    First published: