IPL 2019 Final | MI vs CSK | ఐపీఎల్ 2019 టోర్నీ గెలిచే జట్టు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

టోర్నీ టైటిల్ విన్నర్ ‌జట్టుకు అక్షరాలా రూ.20 కోట్ల సొమ్ము సొంతం కానుంది. అంతే కాదు రన్నర్ అప్ జట్టుకు సైతం రూ.12.5 కోట్ల భారీ పారితోషికం అందనుంది. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుతో పాటు, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు సైతం ప్రత్యేకంగా ప్రైజ్ మనీ అందించనున్నారు.

news18-telugu
Updated: May 12, 2019, 6:18 PM IST
IPL 2019 Final | MI vs CSK | ఐపీఎల్ 2019 టోర్నీ గెలిచే జట్టు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?
ఐపీఎల్ టోర్నీ కప్ (ఫైల్ చిత్రం)
news18-telugu
Updated: May 12, 2019, 6:18 PM IST
ఐపీఎల్ 2019 విన్నింగ్ జట్టుకు ఎంత పారితోషికం ఇస్తారు అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించిన పారితోషికం అధికారిక సమాచారం ప్రకారం టోర్నీ టైటిల్ విన్నర్ ‌జట్టుకు అక్షరాలా రూ.20 కోట్ల సొమ్ము సొంతం కానుంది. అంతే కాదు రన్నర్ అప్ జట్టుకు సైతం రూ.12.5 కోట్ల భారీ పారితోషికం అందనుంది. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుతో పాటు, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు సైతం ప్రత్యేకంగా ప్రైజ్ మనీ అందించనున్నారు. ఇదిలా ఉంటే విన్నింగ్ జట్టు సొంతం చేసుకున్న రూ.20 కోట్ల ప్రైజ్ మనీలో దాదాపు 50 శాతం డబ్బు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుంది. మిగితా డబ్బును జట్టు సభ్యులతో పాటు ఇతర బృంద సభ్యులకు పంచుతారు. అంతేకాదు ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న బ్యాట్స్ మెన్‌కు రూ.10 లక్షల ప్రైజ్ మనీ దక్కనుంది. అయితే ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోదాలో 692 పరుగులు సాధించి అందనంత ఎత్తులో ఉన్న సన్ రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కు ఈ ప్రైజ్ మనీ దాదాపు ఖాయమనే చెప్పవచ్చు.

అలాగే టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన పర్పుల్ క్యాప్ హోల్డర్ కు సైతం రూ.10 లక్షల పారితోషికం అందుకోనున్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కగిసో రబదా 25 వికెట్లు పడగొట్టి రేసులో ముందు వరుసగా ఉన్నప్పటికీ ఫైనల్ మ్యాచ్ లో సీఎస్‌కే తరపున బరిలోకి దిగుతున్న ఇమ్రాన్ తాహిర్ సైతం 24 వికెట్లతో రబదాకు పోటీ ఇస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ లో తాహిర్ 2 వికెట్లు పడగొడితే పర్పుల్ క్యాప్ తో పాటు పదిలక్షల నజరానా సొంతం చేసుకునే చాన్స్ ఉంది. అలాగే ఇతర ప్రైజ్ మనీల విషయానికి వస్తే వీవో పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డుకు సైతం పది లక్షల నజరానా ప్రకటించారు. అలాగే టోర్నీలో హయ్యస్ట్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాట్స్ మెన్ కు హారీర్ ఎస్‌యూవీ కార్ నజరానాగా ఇవ్వనున్నారు.

First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...