IPL 2019 Final MI vs CSK : డుప్లెసిస్ వికెట్ కోల్పోయిన సీఎస్కె.. లక్ష్యం 150 పరుగులు..
MI vs CSK | తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు పరుగులు చేసింది.
news18-telugu
Updated: May 12, 2019, 9:54 PM IST

విజిల్ వేస్తున్న ఇమ్రాన్ తాహిర్ (Image : twitter)
- News18 Telugu
- Last Updated: May 12, 2019, 9:54 PM IST
చెన్నై బౌలర్ల ధాటికి ముంబై చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు పరుగులు చేసింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకొని బ్యాటింగ్ చేసుకుంది. తొలి 4 ఓవర్లలో డికాక్ సిక్సులతో విరుచుకుపడటంతో నాలుగు ఓవర్లలోనే 45 పరుగులు చేసింది. అయితే డికాక్ ఔట్ కావడంతో ముంబై వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆ బంతికే రోహిత్ శర్మ కూడా తక్కువ పరుగులకే ఔట్ అవడంతో ముంబై కష్టాలు మొదలయ్యాయి. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఎస్ఎ యాదవ్ 15 పరుగులు చేసి ఔట్ అవగా, ఇషాన్ కిషన్ 23 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కేవలం పొలార్డ్ మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. పొలార్డ్ తో హార్దిక్ పాండ్యా భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేసినప్పటికీ భారీ స్కోరు నిర్మించలేకపోయారు. పాండ్యా వెనుతిరగడంతో, తరువాత బ్యాటింగ్ కు వచ్చిన చహార్, మెక్ క్లెన్ఘన్ పరుగులేమి చేయకుండానే ఔటయ్యారు.
అటు చెన్నై బౌలర్లలో చహార్ 3 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు, ఇమ్రాన్ తాహిర్ 2 వికెట్లు తీసి ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. దీంతో ముంబై స్వల్ప పరుగులకే పరిమితమైంది.
అటు చెన్నై బౌలర్లలో చహార్ 3 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు, ఇమ్రాన్ తాహిర్ 2 వికెట్లు తీసి ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. దీంతో ముంబై స్వల్ప పరుగులకే పరిమితమైంది.
ప్యాంటు తడిచేలా రక్తం కారుతున్నా... బ్యాటింగ్ వదలని వాట్సన్
IPL 2019 Final: ధోని రనౌట్ నిర్ణయం తప్పేనా?.. అప్పడు ఏం జరిగింది?
IPL Final: అంపైర్ నిర్ణయాన్ని అవహేళన చేశాడు.. దెబ్బకు ఆ క్రికెటర్‌కు..
IPL: ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్‌కింగ్స్ ఓడింది అందుకేనా..
IPL 2019 Final Live Score, MI vs CSK : ఐపీఎల్ 2019 విజేత ముంబై ఇండియన్స్...ఉత్కంఠభరిత మ్యాచ్ గెలుపుతో నాలుగో సారి టైటిల్ సొంతం
MI Vs CSK : ఇద్దరిలో ఇప్పటివరకు ఎవరెన్నిసార్లు కప్ ఎగరేసుకెళ్లారు?
Loading...